సాయం చేసేందుకు అమ్మ దగ్గర వెయిటింగ్

Update: 2015-12-09 04:31 GMT
ఏమైనా అమ్మ అమ్మే. సాధారణంగా ఏదైనా కష్టం వచ్చి పడినప్పుడు సాయం కోసం చుట్టూ చేస్తుంటారు. కానీ..తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి ఇందకు భిన్నంగా ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. వరద కారణంగా దారుణంగా దెబ్బ తిన్న చెన్నై మహానగరానికి సాయం చేసేందుకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేందుకు పారిశ్రామిక వర్గాలు మందుకు వస్తున్నాయి.

విపత్తుతో విలవిలలాడిపోతున్న చెన్నైకు సాయం ఇచ్చేందుకు..అండగా నిలిచేందుకు తాము రెఢీగా ఉన్నామంటూ.. తమ మద్దుతును ప్రకటిస్తూ.. పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు రావటం గమనార్హాం. మంగళవారం అమ్మ దగ్గర బారులు తీరిన పారిశ్రామికవేత్తల్ని చూస్తే.. సాయం కోసం ఇంత మంది ఇంత పెద్ద ఎత్తున సీఎం ఆఫీసుకు రావటమా? అనిపించక మానదు.

ఒకరి తర్వాత ఒకరుగా.. ఒక్కో సందర్భంలో అమ్మ కోసం వెయిటింగ్ చేస్తూ.. పలువురు ప్రముఖులు ఎదురుచూస్తుండటం గమనార్హాం. సాధారణంగా. ఏదైనా సాయం చేయాల్సి వచ్చినప్పుడు.. సాయం చేసే వారి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. కానీ.. అమ్మ వ్యవహారం వేరు. సాయం చేసిన వారు అమ్మ కోసం వెయిట్ చేసే పరిస్థితి.

మంగళవారం ఒక్కరోజులోనే పలువురు పారిశ్రామికవేత్తలు అమ్మను కలిసి తమ విరాళాల చెక్కుల్ని అందచేశారు. వీరిచ్చిన మొత్తం రూ.22కోట్లు కావటం గమనార్హం. మరోవైపు.. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ అయితే ఏకంగా రూ.280 కోట్ల సాయాన్ని ప్రకటించటం తెలిసిందే. మంగళవారం అమ్మను కలిసిన ప్రముఖుల్ని చూస్తే.. టీవీఎస్ సంస్థల అధినేతలు శ్రీనివాసన్.. మల్లికా శ్రీనివాసన్ లు రూ.3కోట్లు.. మాతా అమృతానందమయి తరపు ప్రతినిధులు రూ.5కోట్లు.. జాయ్ అలుక్కాస్ రూ.3కోట్లు.. హ్యుందయ్ రూ.2కోట్లు.. ఇండియా సిమెంట్స్ శ్రినివాస్ రూ.2కోట్లు.. సిటీ యూనియన్ బ్యాంక్ రూ.కోటి.. భారతీయ స్టేట్ బ్యాంక్ రూ.కోటి విరాళాలు ఇచ్చారు.
Tags:    

Similar News