ఏపీ తెలుగుదేశం నేతల తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విషయం ఏదైనా.. ప్రతి దాన్లోనూ ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శ చేయాలన్నట్లుగా వారి మాటలు ఉంటున్నాయి. అవసరం ఉన్నా.. లేకున్నా జగన్ ప్రస్తావన తీసుకొచ్చి.. ఆయనపై సటైర్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఆయన్ను లాగి మరీ చేస్తున్న వ్యాఖ్యలు కొన్నిసార్లు రివర్స్ కొడుతున్నాయి. అయినప్పటికీ తెలుగు తమ్ముళ్లు తమ అత్యుత్సాహాన్ని ఆపుకోలేకపోతున్నారు.
తాజాగా అలాంటి పనే చేసి అడ్డంగా బుక్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అసెంబ్లీకి విపక్ష నేత వైఎస్ జగన్ రెగ్యులర్ గా వేసుకునే బ్లూకలర్ షర్ట్ పోలిన షర్ట్ ను వేసుకొచ్చారు బుచ్చయ్య చౌదరి. సభ వాయిదా పడిన వేళ.. బయటకు వచ్చిన బుచ్చయ్య చౌదరిని ఉద్దేశిస్తూ.. మీడియా ప్రతినిధులు.. అదేంది సార్.. ఇవాళ జగన్.. మీరు చారల చొక్కనే వేసుకొచ్చారంటూ ప్రశ్నించారు.
దీనికి స్పందించిన బుచ్చయ్య చౌదరి.. జగన్ బ్రాండెడ్ చొక్కాలే వేస్తారని.. తాను మాత్రం డిస్కౌంట్ సేల్ లోనే కొంటానన్నారు. బ్రాండెడ్ షర్టులకు పెద్దగా గిరాకీ ఉండదని.. కానీ డిస్కౌంట్ సేల్స్ నే ప్రజలు ఆదరిస్తారని వ్యాఖ్యానించారు. బుచ్చయ్య మాటలన్నీ బాగానే ఉన్నాయి కానీ.. డిస్కౌంట్ సేల్ కు పెట్టే చొక్కాలన్నీ బ్రాండెడ్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు.
సీజన్ ముగుస్తున్నా.. స్టాక్ మిగిలిపోయినా.. ఆదరణ తక్కువగా ఉన్నా.. తమదగ్గర ఉన్న సరుకును వదిలించుకోవాలనుకున్నప్పుడు డిస్కౌంట్స్ పెట్టేస్తుంటాయి. అంటే.. గిరాకీ తగ్గిపోయిన వస్తువులను వదిలించుకోవటానికి డిస్కౌంట్స్ పెట్టుకుంటారన్న చిన్న విషయాన్ని బుచ్చయ్య చౌదరి మర్చిపోవటం.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని విని పాత్రికేయులకు నోట మాట రాని పరిస్థితి. ఇంత సీనియర్ నేతకు అంత చిన్న విషయం తెలీకపోవటం ఏమిటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అతి ఆవేశం.. ఏదోరకంగా తప్పు పట్టాలన్న ఆలోచనలో ఉన్న వారు అదే పనిగా తప్పులు చేయటం మామూలే. అందుకు బుచ్చయ్యచౌదరి వ్యవహారమే పెద్ద ఉదాహరణ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/