జ‌గ‌నన్న‌ మాటే శిరోధార్యం!

Update: 2017-06-21 07:57 GMT
పార్టీ ఫిరాయింపుల‌పై వైసీపీ ఎంపీ బుట్టా రేణుక మీడియాతో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గతంలో టీడీపీలో చేరనున్నారనే ప్రచారం జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఆ సమయంలో చంద్రబాబును బుట్టా రేణుక - ఆమె భర్త ఆయనను కలిశారు. అది అనుకోకుండా జ‌రిగింద‌ని రేణుక మీడియాకు తెలిపారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు తన భర్త కూడా అప్పట్లో చంద్రబాబు నివాసానికి వెళ్లారని, ఆ సమయంలో ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరారని చెప్పారు.

అయితే, తాను మాత్రం చంద్రబాబు ఇంటికి వెళ్లలేదని ఆమె చెప్పారు. ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నానని తెలిపారు. తన భర్త టీడీపీలో చేరే అవకాశం కూడా లేదని చెప్పారు. గెలుపొందిన పార్టీలోనే కొనసాగాలనేది తన అభిప్రాయమన్నారు. పార్టీ ఫిరాయింపుల‌కు తాను వ్యతిరేకమని చెప్పారు.

తనకు2019 ఎన్నికల్లో ఎంపీ టికెట్ దక్కదని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే వార్తలపై కూడా ఆమె స్పందించారు. ఎంపీ కావాలనేది తన కోరిక అని రేణుక తెలిపారు. జగన్ అన్న ఈ విష‌యం గురించి చెప్పన్నప్పుడు.. తాను ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. త‌మ అధినేత త‌న విష‌యంలో సంతోషంగానే ఉన్నారన్నారు. అయితే, రేపు ఏం జరుగుతుందనేది దేవుడికే తెలుసు అని అన్నారు.

త‌మ అధినేత‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను రేణుక కొట్టిపారేశారు. జ‌గ‌న్  పెద్దలను లెక్క చేయరన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయన అందర్నీ గౌరవపూర్వకంగా చూస్తారని తెలిపారు. జగన్‌ ను తాను ఎన్నో సార్లు కలుస్తుంటానని.. ఆయన తనతో ఎంతో అప్యాయంగా మాట్లాడతారని తెలిపారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా సలహాలు ఇస్తుంటారని చెప్పారు. ‘ఇంకొంచెం బలంగా ఉండాలమ్మా.. వాయిస్ పెంచాలి' అని చెబుతుంటారని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News