నంద్యాల ధ‌ర్మ‌యుద్ధం..బాబు పేరెత్తితే మోస‌మే

Update: 2017-08-08 16:26 GMT
నంద్యాలలొ జరుగుతున్న ఉప ఎన్నిక ధర్మానికి అధర్మానికి మద్య జరగుతున్న యుధ్దం అని వైసీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుకా అన్నారు. నంద్యాల‌లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో నందికొట్కూరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్యతో క‌లిసి ఆమె మాట్లాడారు. నంద్యాల ప్రజలు దివంగ‌త సీఎం వైఎస్ ఆర్ ను ఇంకా మర్చిపోలేదని...గడప గడప కు వెళుతుంటే విశేష స్పందన లభిస్తుందని అన్నారు .వైసీపీ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంది కాబట్టి త‌మ పార్టీలో చేరిన శిల్పా చక్రపాణీ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చారని ఎంపీ రేణుక అన్నారు. నంద్యాల అసెంబ్లీ స్థానం వైఎస్ఆర్ పార్టీది కానీ టీడీపీ పొటీకి అభ్యర్థిని నిలబెట్టిందని అన్నారు. ధర్మం వైసీపీ వైపే ఉందని....నంద్యాలలో వైసీపీ గెలుస్తుందని ఎంపీ రేణుక ధీమా వ్య‌క్తం చేశారు.

నంద్యాల‌లో మూడున్నర సంవత్సరాల్లో చేయని అభివృద్ది ఇప్పుడు ఎలా చేస్తారని ఎంపీ రేణుక ప్ర‌శ్నించారు. కర్నూల్ లో నీరులేక జనాలు అల్లాడుతుంటే...హంద్రినీవా నుండి 32 టీఎంసీలు ఎత్తిపోస్తూ అనంతపురం జిల్లాకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్దులకు ,వితంతువులకు పింఛను అందడంలేదని ఆదవేద‌న వ్య‌క్తం చేశారు. ఉద్యోగాలు లేక యువత అల్లాతోంద‌ని, రైతులు,డ్వాక్రా మహిళలు  రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. చంద్రబాబు హామీలు శిలాఫలకాలకే పరిమతమయ్యాయని ఎంపీ రేణుక మండిప‌డ్డారు. అనంతరం ఎమ్మెల్యే  ఐజయ్య  మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి మోసకారి, ఎంతటివారినైనా మోసం చేసే నైజం చంద్రబాబుదని మండిప‌డ్డారు. నంద్యాల ఉప ఎన్నిక మోసానికి ,ధర్మానికి జరుగుతున్న ఉప ఎన్నిక  అని అన్నారు.

పీవీ నర్సింహరావు ,నీలం సంజీవ రెడ్డి వంటి వారిని గెలిపించిన ఘనత నంద్యాల ప్రజలదని ఎమ్మెల్యే ఐజ‌య్య‌ తెలిపారు. చంద్రబాబు చేసే మోసపు వాగ్దానాలు నంద్యాల ప్రజలు నమ్మరని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మూడవ తేదీన జరిగిన జగన్ బ‌హిరంగ సభను చూసి చంద్రబాబుకు దడ పుట్టిందని ఐజ‌య్య వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజ్యాంగ విలువలు కాపాడారని అయితే...20 మంది ఎమ్మెల్యేల‌ను ప్రలోభపెట్టి మంత్రి పదవులు ఆశ చూపి వైసీపీ నుండి టీడీపీలోకి రాజ్యాంగ విరుద్దంగా చేర్చుకున్నార‌ని మండిప‌డ్డారు. చంద్రబాబుకు నంద్యాల ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఐజ‌య్య ధీమా వ్య‌క్తం చేశారు. టీడీపీ పతనం నంద్యాల నుండే ప్రారంభం అవుతుందని మండిప‌డ్డారు.
Tags:    

Similar News