బీజేపీ వ్యతిరేక పోరాటం - దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తాం....నేనే ప్రధాని మోడీ కంటే సీనియర్ ను...ఢిల్లీలో చక్రం తిప్పుతా...అంటూ భారీ ప్రకటనలు ఇస్తూ...దేశవ్యాప్తంగా టూర్లు పెట్టుకొని గడిపేస్తున్న ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి - తమతో అద్భుతమైన జోడి అని ప్రచారం చేసుకొని తీరా ఎన్నికల ముంగిట వ్యతిరేకతను పడకుండా చేసుకునేందుకు బాబు ఎత్తుగడలో భాగమే తాజా హడావుడి అని కొందరు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ జాబితాలో మరో అంశం కూడా చేరింది. సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు తాజాగా మీడియాతో మాట్లాడుతూ బాబు పోజులు పెట్టడం తప్ప నిజమైన పోరాటం చేయడం లేదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవకాశవాద రాజకీయాలకు సుపరిచితులని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు వ్యాఖ్యానించారు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ సమయంలోనే చంద్రబాబు ప్లేటు ఫిరాయించారనీ - అవసరానికి తగ్గట్లు ఆయన మారిపోతుంటారనీ చెప్పారు. ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పోరాటం అంటూ ఆయన చేస్తున్న హడావుడి అంతా ఫొటోలకు పోజులకే సరిపోతుందన్నారు. చంద్రబాబు వెళ్లి కలుస్తున్న వారంతా ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకరంగా ఉన్నవారేనని రాఘవులు అన్నారు. బాబుకు నిజంగా బీజేపీని బలహీనపర్చాలనుకుంటే ఎన్డీఏలో కొనసాగుతున్న తన పాత మిత్రులను ఆ కూటమి నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు. అకాలీదళ్ - జనతాదళ్ (యు) - ఎల్ జేపీ - శివసేనలాంటి అనేక పార్టీలు బీజేపీతోనే ఉన్నాయని - ఆయా పార్టీల నాయకులు చంద్రబాబుకు పాత మిత్రులు గనుక వారిని బీజేపీకి దూరం చేస్తే ప్రయోజనముంటుందని పేర్కొంటూ చంద్రబాబు ఈ పని ఎందుకు చేయడం లేదని రాఘవులు సూటిగా ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో కూటముల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని - రాష్ట్రాల వారీగా ఎక్కడికక్కడ బీజేపీని నిలువరించడం ద్వారానే కేంద్రంలో ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చేయగలుగుతామన్నారు.
నోట్ల రద్దులో చంద్రబాబుకూ భాగం ఉందనీ, ఆ సమయంలో బీజేపీ తీరును సమర్థించిన ఆయన ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్లు ఫోజు పెడుతున్నారని రాఘవులు విమర్శించారు. పెద్ద నోట్లు రద్దు చేసి నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకొనే అక్రమార్కు లకు ఉపయోగపడ్డారన్నారు. గతంతో పోల్చుకుంటే ఉగ్రవాదం రెండు రెట్లు పెరిగిందనీ - దేశ ఆర్థికస్థితి మాంద్యంలోకెళ్లిందనీ చెప్పారు. నోట్ల రద్దు నష్టమని ఆర్ బిఐ మినిట్స్ లోనే ఉందనే విషయం ఇప్పుడు బయటకొచ్చిందనీ, దీనిపై మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు. జిఎస్ టి పునాదిలోనే ప్రమాదకరమైన అంశాలున్నాయనీ - రూపాయి పతనమైందనీ చెప్పారు. ఆర్థిక పరిస్థితి పతనమై ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బీజేపీ మత విద్వేషాలపై దృష్టిపెట్టి ప్రజలను రెచ్చగొడుతోందన్నారు. సుప్రీం కోర్టు తీర్పుల్ని సైతం లెక్కచేయడం లేదన్నారు. శబరిమల విషయంలోనూ - రామమందిరం విషయంలోనూ బీజేపీ తీరు ప్రమాదకరంగా ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని ఏ మాత్రమూ లెక్కచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.