థర్డ్ ఫ్రంట్ పేరుతో దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుకు మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా తటస్థులుగా ఉండి...సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకిస్తూ...కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేకపోతున్న వామపక్షాలకు కేసీఆర్ ప్రకటన తీపికబురు ఇచ్చింది. వామపక్షాల్లో కీలక పార్టీ అయిన సీపీఎం ఈ మేరకు కేసీఆర్ ప్రకటనను స్వాగతించింది. బీజేపీ - కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ కు పిలుపునివ్వడం మంచి విషయమేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. అయితే ఈ రెండు పార్టీలకు భిన్నంగా ఏం చేస్తోందో చెప్పాలని అన్నారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బీవీ రాఘవులు ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. 'ఒకవేళ మూడో ఫ్రంట్ కూడా కాంగ్రెస్, బీజేపీ మాదిరిగా వ్యవహరిస్తే దేశానికి ఎలాంటి ప్రయోజనం ఉండబోదు. మూడో ఫ్రంట్ లక్ష్యం ఏంటి? దేశంలో ఎలాంటి కార్యక్రమాలు చేయనుంది? బీజేపీ మతోన్మాదాన్ని ప్రతిఘటించేందుకు ఏం చేస్తది? ఇలాంటివి కూడా వివరిస్తే మూడో కూటమి దేశానికి మేలు చేస్తుందా లేదా అని ప్రజలు ఆలోచిస్తారు' అని రాఘవులు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే భ్రష్టుపట్టిపోయాయని చెప్పారు. థర్డ్ ఫ్రంట్ విషయంలో ప్రజలకు కొత్త ఆశలు కలుగుతున్నాయన్నారు.
ఇదిలాఉండగా...ఇప్పటికే సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరికి సైతం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 11వ తేదీన ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఏచూరికి ఫోన్ వెళ్లింది. అయితే ఆ సమయంలో ఏచూరి ఏపీలో ఉన్నారు. ఆ రాష్ట్ర పార్టీ మహాసభలకు హాజరయ్యేందుకు భీమవరం వెళ్లారు. ఏచూరికి ఫోన్ చేసిన కేసీఆర్ 'ముఖ్యమైన అంశంపై మాట్లాడాలి' అని చెప్పినట్టు సమాచారం. అయితే తాను ప్రస్తుతం ఏపీలో ఉన్నానని, ఢిల్లీకి వచ్చిన తరువాత కలుస్తానని చెప్పినట్టు తెలిసింది. 13వ తేదీన ఏచూరి ఢిల్లీ వచ్చినప్పటికీ ఆ మరుసటి రోజు మధ్యాహ్నమే మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ తదితర ఐదు రాష్ట్రాల పార్టీ మహాసభలకు బయల్దేరి వెళ్లారు. కేసీఆర్ ఫోన్ విషయంపై ఏచూరీని ఆరా తీయగా.. కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చినట్టు చెప్పారు. అయితే ఏచూరి దక్షిణాది రాష్ట్రాల పార్టీ మహాసభల్లో బిజీబిజీగా గడపటంతో ఇరువురి మధ్య సమావేశం కుదరలేదని తెలిసింది.