ఇక సెటిలర్స్‌ అనే పదం ఉండదు

Update: 2018-12-11 10:14 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీ ఆర్‌ ఎస్‌ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సొంతంగానే ప్రభుత్వంను ఏర్పాటు చేయగల సత్తా ఉంది అని నిరూపితం అయ్యింది. హైదరాబాద్‌ లో సెటిలర్స్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజా కూటమి అభ్యర్థులు మాత్రమే గెలుపొందుతారని అంతా భావించారు. కాని అనూహ్యంగా హైదరాబాద్‌ లో టీఆర్‌ ఎస్‌ పార్టీ భారీ సీట్లను దక్కించుకుంది. సెటిలర్స్‌ అంతా కూడా టీఆర్‌ఎస్‌ కు మద్దతు తెలిపినట్లే అంటూ అంతా భావిస్తున్నారు. కూకట్‌ పల్లిలో ఎక్కువగా ఉండే సెటిలర్స్‌ ఖచ్చితంగా తెలుగు దేశ అభ్యర్థి సుహాసినికి ఓటు వేస్తారని భావించారు. కాని అక్కడ కూడా టీఆర్‌ఎస్‌ గెలుపొందిన నేపథ్యంలో ఇక సెటిలర్స్‌ మొత్తం తెలంగాణ వారు అయ్యారు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

తాజాగా ఈ విషయమై రచయిత, దర్శకుడు బీవీఎస్‌ రవి ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... అభివృద్ది, సంక్షేమంకు ప్రజలు ఓట్లు వేశారు. నేటితో సెటిలర్స్‌ అనే పదం లేకుండా పోతుంది. హైదరాబాద్‌ అనేది అందరి నగరం, అందరికి అనువైన నగరం. హైదరాబాద్‌ ను కేటీఆర్‌ గారు మరింత అభివృద్ది చేస్తారని విశ్వసిస్తున్నాం అంటూ ట్వీట్‌ చేశాడు. సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది కూడా టీఆర్‌ఎస్‌ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడుతున్నారు.
Tags:    

Similar News