ఏపీకి 3 రాజధానులు..బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Update: 2019-12-26 11:17 GMT
రాయలసీమ పోరాట హక్కుల నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్న సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆయన స్పందించారు. విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

బైరెడ్డి మాట్లాడుతూ.. ‘కడుపునిండిన వాడికే రాజధానిని తీసుకెళ్లి పెడుతున్నారంటూ’ సీఎం జగన్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ కంటే ఎక్కువగా అభివృద్ధి చెందిన విశాఖకు రాజధానిని తరలించడం సరికాదని బైరెడ్డి తప్పుపట్టారు.  రాజధాని వ్యవహారం ఏపీలో రెండు కులాల మధ్య పిచ్చి సంఘర్షణ అని బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో రెండు కులాల మధ్య జరుగుతున్న ఘర్షణ కారణంగానే అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నంకు తరలిపోతోందని బైరెడ్డి హాట్ కామెంట్ చేశారు. రెండు కులాల రాజకీయం వల్లే రాజధాని వ్యవహారం సమస్యగా మారిందని.. రెండు కులాల ఓట్లు - సీట్లు కోసం చేస్తున్న రాజకీయాల వల్లే రాజధాని తరలింపు నిర్ణయం జరిగిందని బైరెడ్డి విమర్శించారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందని మండిపడ్డారు.

అమరావతి నుంచి రాజధాని నుంచి తరలిస్తే కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేసి వెనుకబడిన సీమను అభివృద్ధి చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు.
Tags:    

Similar News