టీడీపీ నుంచి వెళ్లిపోయి మళ్లీ రావాలని ప్రయత్నించి విఫలమైన నేత, రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరం లేదని ఆయన కొత్త యాంగిల్ తీసుకొచ్చారు. కోస్తా నుంచి రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందంటూ ఇంకో సంచలన వ్యాఖ్య చేశారు.
రాయలసీమ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ కర్నూలులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద విద్యార్థులు చేపట్టిన దీక్షకు బైరెడ్డి మద్ధతు తెలిపారు. అనంతరం ఆయన రాయలసీమ యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని నాయకులు పచ్చి అబద్దాలు చెబుతున్నారంటూ టీడీపీని ఉద్దేశించి పరోక్ష విమర్శలు గుప్పించారు. అయితే... సాధారణంగా ఎవరిని విమర్శించడానికైనా వెనుకాడని బైరెడ్డి టీడీపీని నేరుగా విమర్శించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. ఈ లెక్కన ఆయన టీడీపీలోకి వచ్చేందుకు తనకున్న కొద్ది పాటి అవకాశాలను సజీవంగా ఉంచేందుకే అలా పరోక్ష విమర్శలు చేసుంటారని భావిస్తున్నారు.