గృహ నిర్బంధంలో ఉన్న రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన ఇంటి వద్దే దీక్షను ప్రారంభించారు. తంగడంచలో పరిశ్రమల కోసం భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఆయన తంగడంచ నుంచి కర్నూలు వరకు పాదయాత్ర తలపెట్టేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు... బైరెడ్డిని గృహ నిర్బంధం చేశారు. దీంతో బైరెడ్డి తన ఇంటి వద్దనే దీక్షను ప్రారంభించారు.
మొన్నటి ఎన్నికల సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న బైరెడ్డి ఆ తరువాత టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. రాయలసీమ వెనుకబాటును కారణంగా చూపిస్తూ బైరెడ్డి ఎన్ని చేసినా పెద్దగా గుర్తింపు రావడం లేదు. ఇటీవలే ఆయన ఢిల్లీలో ఆందోళన చేశారు. తాజాగా పరిశ్రమ భూసేకరణ కోసం పాదయాత్ర చేయబోయి హౌస్ అరెస్టయ్యారు. ఏం చేసినా కూడా రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఆయన మునుపటి ఇమేజిలో ఇసుమంత కూఆ సంపాదించుకోలేకపోతున్నారు.
కాగా... బైరెడ్డి పాదయాత్ర, దీక్ష కారణంగా కర్నూల్ లో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీగా మొహరించారు. ఓర్వకల్లు, జూపాడుబంగ్లా మండలాల్లో పోలీసులు రైతులను ముందస్తుగా అరెస్టు చేశారు.