నంద్యాల ఉప ఎన్నికలో బరిలోకి మూడో పార్టీ దిగింది. ఇప్పటికే టీడీపీ - వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించగా తాజగా రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కూడా ఈ ఎన్నికలకు తమ పార్టీ నుంచి అభ్యర్థిని దించుతామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత రాజకీయాల గురించి తనదైన స్టైల్లో వ్యాఖ్యానించారు. రాజకీయాలు వ్యాపారంలా మారిపోయాయని... ప్రజా సేవ గురించి, తమ ప్రాంత సమస్యల గురించి ఆలోచించే నాయకులే రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు బలంతో గెలవచ్చనే ధీమాతో నేతలు ఉన్నారని అన్నారు.
తాము హుండీలను ఏర్పాటు చేసి, ప్రజలు ఇచ్చిన చందాలతో ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం నిధులను దుర్వినియోగం చేస్తున్నారని... వైసీపీ అధినేత జగనేమో రాయలసీమను అస్సలు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మంత్రి అఖిలప్రియ, నంద్యాల వైఎస్సార్సీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి లపై మండిపడ్డారు. వారిద్దరూ ఏ పార్టీయో అర్థం కావడం లేదని, వారే చెప్పలేరని, రాజకీయాలు షేర్ మార్కెట్లా మారిపోయాయని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/