కర్నూల్ లో జగన్ ను కాలుపెట్టనివ్వం ... బైరెడ్డి శబరి !

Update: 2020-11-19 17:40 GMT
తుంగభద్ర పుష్కరాలకు వచ్చే సీఎం జగన్ కాన్వాయ్ ను అడ్డుకుంటామని ఫైర్ బ్రాండ్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు బైరెడ్డి శబరి హెచ్చరించారు. రాజకీయాల్లో తండ్రికి తగ్గ కూతురిగా పేరు తెచ్చుకున్న బైరెడ్డి శబరి ,ప్రస్తుత రాజకీయాలపై చాలా లోతుగా అలోచించి స్పందిస్తుంటారు. తాజాగా ఏపీ సీఎం జగన్ తుంగభద్ర పుష్కరాలు రద్దు చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఈ ఏడాది తుంగభద్ర పుష్కరాలను ప్రభుత్వం దాదాపుగా రద్దు చేసేసింది. కరోనా నేపథ్యంలో పుష్కరాల్లో కేవలం పూజలకి మాత్రమే అనుమతి ఇచ్చింది. నదిలో పవిత్ర పుష్కర స్నానాలు, ఇతర కార్యక్రమాలకి అనుమతి లేదు.

అయితే , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తుంగభద్ర పుష్కరాల సందర్భంగా అక్కడకు చేరుకుని పూజల్లో పాల్గొనబోతున్నారు. దీనితో పుష్కరాలకు వచ్చే సీఎం జగన్‌ కాన్వాయ్‌ను అడ్డుకుని తీరుతామని బైరెడ్డి శబరి హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం పుష్కర స్నానాలు అడ్డుకోవడంపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ నాయకులు పాదయాత్రలు, బహిరంగసభలు పెట్టుకున్నప్పుడు కనిపించని కరోనా తుంగభద్ర నదిలో స్నానాలు చేస్తే వస్తుందా అని , ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తోందని శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా కర్నూలు వచ్చే సీఎం జగన్‌ను అడ్డుకుని తమ నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు.

ఇదిలా ఉంటే ... పోతిరెడ్డి హెడ్‌ రెగ్యులేటర్‌ విషయంలో తీవ్ర వ్యాఖ్యలతో ఫైర్ ‌బ్రాండ్‌ నేతగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే , ఈ మధ్య కాలంలో అయన రాజకీయంగా అంతగా క్రియాశీలకంగా ఉండటం లేదు. కానీ, కూతురు బైరెడ్డి శబరి మాత్రం తనదైన శైలిలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించి తండ్రిలాగే ఫైర్ బ్రాండ్
Tags:    

Similar News