ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్), వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్థార్థ్‌రెడ్డి ఉన్నట్టుండి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 5న కర్నూలులో నిర్వహించిన సీమ గర్జన సభలో బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
రాజధానిని అడిగే హక్కు రాయలసీమ వాసులకు ఉందని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టేటప్పుడు రైతులు భూములిచ్చి ఎంతో త్యాగం చేశారని గుర్తు చేశారు. రాయలసీమకు చంద్రబాబు ఎంతో ద్రోహం చేశారని చెప్పారు. అన్ని ప్రాంతాలతోపాటు రాయలసీమను సమానంగా అభివృద్ధి చేయాలని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో సిద్ధార్థ్‌రెడ్డి ప్రసంగాన్ని ఆపేశారు. అందరూ క్షమించాలి అంటూ ఆయన తన ప్రసంగాన్ని ఆపేశారు. అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోగా కార్యకర్తలు బైరెడ్డికి ప్రాథమిక చికిత్స అందించారు.
కాగా కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి చిన్న వయసులోనే యువతలో క్రేజు సంపాదించుకున్నారు. గత ఎన్నికల సమయంలో నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ కన్వీనర్‌గా వ్యవహరించారు. నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ఆయనకు సీటు దక్కలేదు. గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి తొగురు ఆర్థర్ విజయానికి కృషి చేశారు.
ఆ తర్వాత వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో టీడీపీలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే వైసీపీ సిద్ధార్థ్‌రెడ్డిని శాప్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో పాణ్యం నుంచి పోటీ చేయడానికి బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి బైరెడ్డి చూస్తున్నారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.