బాబు వ‌ద్ద‌కు ఆ ఇద్ద‌రు ఎంపీల పంచాయ‌తీ

Update: 2016-08-02 05:36 GMT
ఏపీ సీఎం చంద్ర‌బాబు ర‌క‌ర‌కాల టెన్ష‌న్స్‌ లో ఉన్నారు. ఓ వైపు విప‌క్ష వైకాపా నుంచి జంపింగ్‌ ల నేప‌థ్యంలో అక్క‌డ ఉన్న ఇన్‌ చార్జ్‌ లు - పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చిన ఎమ్మెల్యే మ‌ధ్య వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌డం, మ‌రో వైపు ఏపీకి ప్ర‌త్యేక హోదా టెన్ష‌న్‌ - రాష్ర్టాభివృద్ధికి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డం ఇలా బాబును ఎన్నో స‌మ‌స్య‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 ఇదిలా ఉంటే చంద్ర‌బాబు వ‌ద్ద‌కు ఇప్పుడు మ‌రో పంచాయ‌తీ చేరింది. ఇది టీడీపీలో ఎంపీలుగా ఇద్ద‌రు ఎంపీల పంచాయ‌తీ కావ‌డం విశేషం. ఏపీ ఒలింపిక్ సంఘంపై నెల‌కొన్న వివాదం పంచాయ‌తీ సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరింది. రాష్ర్ట విభ‌జ‌న త‌ర్వాత టీడీపీ నేత‌లు - ఆ పార్టీకి చెందిన ఎంపీలు సీఎం ర‌మేష్‌ - గ‌ల్లా జ‌య‌దేవ్ మ‌ధ్య ఒలింపిక్ సంఘం ఎన్నిక‌పై వివాదం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు వ‌ర్గాలు ఎవ‌రికి వారే ఎన్నిక‌లు నిర్వ‌హించుకుని త‌మ‌దే అస‌లైన ఒలింపిక్ సంఘ‌మ‌ని ప్ర‌క‌టించుకున్నారు. అలాగే ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు కూడా గుప్పించుకున్నారు.

 అప్ప‌టి నుంచి రెండువ‌ర్గాల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. ఇక ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య వివాదాన్ని ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పిన ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సైతం మిన్న‌కుంటున్నారు. దీంతో సీఎం ర‌మేష్ సంఘం త‌ర‌పున ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌ రెడ్డి కుమారుడు జేసీ ప‌వ‌న్‌ రెడ్డి సోమ‌వారం ఈ విష‌య‌మై విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబును క‌లిశారు. ఏపీ ఒలింపిక్ సంఘం గుర్తింపుపై ఉన్న వివాదాన్ని ప‌రిష్క‌రించాల‌ని కోరారు. ఈ అంశాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని చంద్ర‌బాబును అధికారుల‌ను ఆదేశించారు. మ‌రి ఈ విష‌యంలో ఫైన‌ల్‌గా ఎవ‌రికి అనుకూలంగా నిర్ణ‌యం ఉంటుందో పెద్ద స‌స్పెన్స్‌ గా మారింది.
Tags:    

Similar News