లోదుస్తులు ధరించాలని పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఆదేశం

Update: 2022-09-30 08:47 GMT
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) తన క్యాబిన్ సిబ్బందికి లోదుస్తులు (డాయర్లు, ఇన్నర్ వేర్లు) ధరించాలని..  సరైన దుస్తులు ధరించాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. నివేదికల ప్రకారం పిఐఎ జనరల్ మేనేజర్ అమీర్ బషీర్ ఎయిర్ హోస్టెస్‌ల డ్రెస్సింగ్‌ను విమర్శించారు.. దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేశారు.

పీఐఏ ప్రకారం క్యాబిన్ సిబ్బంది సూచనాత్మక వేషధారణతో ఎయిర్‌లైన్స్ పై ప్రతికూల ప్రభావం పడుతోందని అంటున్నారు. కొంతమంది క్యాబిన్ సిబ్బంది ఇంటర్‌సిటీలో ప్రయాణిస్తున్నప్పుడు, హోటళ్లలో బస చేస్తున్నప్పుడు మరియు వివిధ రకాల సందర్శనల సమయంలో సాధారణ దుస్తులు ధరించడం చాలా ఆందోళనతో కలిగిస్తోందని.. అలాంటి డ్రెస్సింగ్ వీక్షకుడిపై పేలవమైన అభిప్రాయాన్ని కలిగిస్తుందన్నారు.

వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. సంస్థకు వీరి డ్రెస్సులతో నష్టం కలుగుతోంది." అని పిఐఎ జనరల్ మేనేజర్ (ఫ్లైట్ సర్వీసెస్) అమీర్ బషీర్ పంపిన అంతర్గత సూచన మెమోలో ఆదేశించినట్టు తెలిసింది.
 
 పాకిస్తాన్ ప్రభుత్వం  నిర్వహించబడుతున్న పీఐఏ ఈ కొత్త నోటిఫికేషన్‌కు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని దాని సిబ్బందిని కోరింది. బషీర్ ఎయిర్‌లైన్ సిబ్బందిని ఫార్మల్ సాదా దుస్తులు ధరించి "సరైన లోదుస్తులు" లోపల ధరించాలని ఆదేశించారు.. మగ, ఆడవారు ధరించే దుస్తులు మన పాకిస్తానీ జాతీయ మరియు సాంస్కృతిక నైతికతకు అనుగుణంగా ఉండాలని ఆయన అన్నారు.

గ్రూమింగ్ ఆఫీసర్లు క్యాబిన్ సిబ్బందిని ఎల్లప్పుడూ"పర్యవేక్షించవలసిందిగా కోరారు.  నిబంధనలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని ఆదేశించారు. ప్రయాణికులను రెచ్చగొట్టకుండా కురుచ దుస్తులు ధరించకుండా విమానంలో అనైతికతకు తావు ఇవ్వకూడదనే ఇలా ఫార్మల్ డ్రెస్సులు వేసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు.

ఇటీవల ఒక పాకిస్తానీ ప్రయాణీకుడు పెషావర్ నుండి  దుబాయ్‌కి బయలుదేరిన విమానం కిటికీని పగలగొట్టడానికి ప్రయత్నించడంతో పీఐఏ కఠిన ఆదేశాలు ఇచ్చింది. విమానంలో నమాజ్ చేయకుండా ఆపడంతో ఆ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో విన్నట్లుగా అతను ఫ్లైట్ ఎక్కేటప్పటికి బాగానే ఉన్నాడని, అకస్మాత్తుగా ఈ విధంగా ప్రవర్తించడం ప్రారంభించాడని ప్రయాణికులు చెప్పడం కనిపించింది. విమానంలో నమాజ్ చేయకుండా ఆపిన తర్వాత ప్రయాణీకుడు ఈ తతంగాన్ని సృష్టించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News