5జీ స్పెక్ట్రం వేలానికి కేబినెట్ ఆమోదం

Update: 2020-12-16 15:21 GMT
ఇప్పటికే భారతదేశంలో జియో తీసుకొచ్చిన 4జీ కే జనాలు ఇంకా మారలేదు. యువత, మధ్యతరగతి స్మార్ట్ ఫోన్లకు మారినా గ్రామాల్లోని రైతులంతా ఇంకా 2జీ ఫోన్లనే వాడుతున్నారు. 4జీకి జనాలు ఇంకా మారకముందే 5జీ వచ్చేస్తోంది.

తాజాగా కేంద్ర కేబినెట్ 5జీ వేలానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు 5జీ స్పెక్ట్రం వేలం విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ వేలానికి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు.

20 ఏళ్ల వ్యాలిడిటీ పీరియడ్ తో వివిధ ఫ్రీక్వెన్సీ బ్రాండ్లలో 4జీ స్పెక్ట్రంను మార్చిలో వేలం నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దీని ద్వారా 3,92,332.70 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనావేస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

గత 4జీ స్పెక్ట్రం వేలం జరిగి 4 సంవత్సరాలు అయ్యిందని కేంద్రమంత్రి తెలిపారు. 2016లో వేలంకి ఉన్న షరతులే ఇప్పుడు ఉంటాయని అన్నారు. 5జీ స్ప్రెక్ట్రం కొనుగోలు చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులను ఈనెలలోనే ఆహ్వానిస్తామని, మార్చి 2021కల్లా ఈ స్పెక్ట్రం ల వేలం ప్రక్రియ పూర్తిచేసేందుకు తాము ప్రతిపాదిస్తామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
Tags:    

Similar News