వార‌సుడొస్తున్నాడు... మంత్రిగా లోకేష్‌

Update: 2016-04-06 07:30 GMT
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు త‌న త‌న‌యుడు లోకేష్ విష‌యంలో టెన్ష‌న్ తీరిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. కొద్ది రోజులుగా లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో తెలియ‌క చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. లోకేష్‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌ని ఆలోచన చేస్తోన్న చంద్ర‌బాబు ఆయ‌న్ను కేంద్ర మంత్రిగా పంపాలా లేదా రాష్ర్టంలో త‌న మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాల‌ని అని ఆలోచన చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

అలాగే లోకేష్‌ ను మండ‌లికి పంపాలా లేదా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో నిల‌బెట్టి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా అన్న ప్ర‌శ్న‌లు కూడా చంద్ర‌బాబు మ‌దిలో మెదిలాయి. ఈ విష‌యంలో బాబు లోకేష్‌ ను ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో నిల‌బెట్టి గెలిపించాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. అందుకోసం ఓ నియోజ‌క‌వ‌ర్గం కూడా చూసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌ది సంవ‌త్స‌రాలు అధికారంలో ఉన్న‌ప్పుడు సోనియాగాంధీ రాహుల్‌ ను మంత్రి చేయ‌లేద‌ని..దీంతో ఆయ‌న‌కు పాల‌నా ప‌ర‌మైన అనుభ‌వం రాలేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. రాహుల్ విష‌యంలో సోనియా చేసిన త‌ప్పును చంద్ర‌బాబు చేయ‌కూడ‌ద‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

 ఇప్ప‌టికే పార్టీ బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్న లోకేష్‌ ను ముందుగా కేంద్ర మంత్రిగా పంపాల‌నుకున్నా భ‌విష్య‌త్తులో బీజేపీతో టీడీపీ క‌టిఫ్ చేసుకునే ఛాన్సులున్నందున లోకేష్‌ ను బాబు త‌న కేబినెట్‌ లోకే తీసుకుని కీల‌క‌మైన విద్యుత్‌ - ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌లు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

  చంద్ర‌బాబు జూన్ - జూలై నెల‌ల్లో కేబినెట్ ను విస్త‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న‌వారిలో ప‌ని తీరు బాగోలేద‌ని విమ‌ర్శ‌లున్న‌వారిని ఇంటికి పంపాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇక కొత్త‌గా బాబు కేబినెట్‌ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో లోకేష్‌ తో పాటు వైకాపా నుంచి టీడీపీలోకి వ‌చ్చిన ఎమ్మెల్యేల్లో కొంద‌రికి టీడీపీలో సీనియ‌ర్ల‌కు ఛాన్సులు ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.
Tags:    

Similar News