జగన్ 2.0 కేబినెట్ తుది జాబితా రెడీ అయింది. గవర్నర్‌కు పంపించిన తుది జాబితా వివరాలు.. మీడియా కు కూడా అందాయి. వీటిలో 10 మంది బీసీలు, ఐదుగురు ఎస్సీ, నలుగురు రెడ్లు, నలుగురు కాపులకు పెద్ద పీట వేశారు. అదేవిధంగా ఒక మైనారిటీ నాయకుడు కూడా ఉన్నారు. ఈ వ్యూహాన్ని పరిశీలిస్తే.. బీసీ లకు పెద్దపీట వేయడం ద్వారా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి షాకిచ్చే వ్యూహాన్ని జగన్ అమలు చేయను న్నారనే చర్చ జరుగుతోంది. పైగా.. ఫైర్‌బ్రాండ్ రోజాకు ఈ దఫా అవకాశంకల్పించడం.. విశేషం.
మంత్రుల జాబితాలో బీసీలను గమనిస్తే.. శ్రీకాకుళం నుంచి ధర్మన ప్రసాద రావు(వెలమ బీసీ), సీదిరి అప్పల రాజు(మత్యకార బీసీ), విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ(తూర్పు కాపు బీసీ), ముత్యాల నాయుడు(కొప్పుల వెలమ బీసీ), చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ(బీసీ.. శెట్టి బలిజ), పశ్చిమ గోదావరి జిల్లా - కారుమూరి నాగేశ్వరరావు(యాదవ - బీసి), కర్నూలు జిల్లా నుంచి గుమ్మనూరు జయరాం (బీసి - బోయ), కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్ (గౌడ - బీసి), అనంతపురం జిల్లా నుంచి ఉషా శ్రీ చరణ్ (కురుప బీసి), గుంటూరు జిల్లా నుంచి విడదల రజని (బీసి - రజక) చోటుదక్కించుకున్నారు.
కాపుల కోటాలో.. విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాధ్ (కాపు), కాకినాడ జిల్లా - దాడిశెట్టి రాజా (కాపు), కొట్టు సత్యనారాయణ (కాపు), గుంటూరు జిల్లా - అంబటి రాంబాబు (కాపు) ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ కోటాలో.. పార్వతీపురం నుంచి రాజన్న దొర (ఎస్టీ), కోనసీమ జిల్లా - పినిపె విశ్వరూప్ (ఎస్సి)
తూర్పుగోదావరి జిల్లా - తానేటి వనిత(మాదిగ - ఎస్సీ), మేరుగ నాగార్జున (మాల ఎస్సీ), నారాయణ స్వామి (ఎస్సీ), తిప్పే స్వామి (ఎస్సీ) ఉన్నారు.
రెడ్డి కోటాలో కేబినెట్ దక్కిన వారు.. వీరే. నెల్లూరు జిల్లా - కాకాణి గోవర్ధన రెడ్డి (ఓసి - రెడ్డి), కర్నూలు జిల్లా - బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి (ఓసి - రెడ్డి), చిత్తూరు జిల్లా - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసి - రెడ్డి), ఆర్ కే రోజా (ఓసీ - రెడ్డి) ఉన్నారు. వీరితోపాటు కడప జిల్లా - అంజద్ బాషా (మైనార్టీ) చోటు దక్కించుకున్నారు.