70 శాతం మంది ఎమ్మెల్యేలు రాలేదా?

Update: 2022-04-11 14:33 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఒక పండుగ వాతావ‌ర‌ణం మాదిరిగా జ‌రుగుతుంద‌ని భావించిన కొత్త మంత్రి వ‌ర్గ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం.. బోసి పోయిందా?  లేక‌.. సాదా సీదాగా జ‌రిగిందా? అంటే.. సాదాసీదాగానే జ‌రి గింద‌నే వాద‌న వినిపిస్తోంది. 2019లో జ‌రిగిన ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలు అంద‌రూ హాజ‌రై.. డ‌ప్పుల మోత‌లు.. బాణాసంచా కాల్పుల‌తో జోరెత్తించారు. అయితే.. ఇప్పుడు ఆ సంద‌డి లేకుండా పోయింది. ఎవ‌రూ పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌లేద‌ని అనిపిస్తోంది.

సుమారు మూడేళ్ల త‌ర్వాత‌.. ఏర్ప‌డిన కొత్త మంత్రి వ‌ర్గం ముచ్చ‌ట‌.. ఎటు చూసినా ఉప్పులేని చ‌ప్పిడి మాదిరిగా ఉంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మానికి ఏరికోరి.. సెల‌క్టెడ్ నేత‌ల‌కే.. ఆహ్వానాలు పంపారు. ప్ర‌త్యేక విందును కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఎమ్మెల్యేలు చాలా మందికి ఆహ్వానాలు అందాయి. అయితే.. వీరిలో ఎక్కువ మంది హాజ‌రు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇలా దాదాపు 70 శాతం మంది ఎమ్మెల్యేలు ఈప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేద‌ని.. అంటున్నారు.

ఇదే విష‌యాన్ని టీడీపీ అనుకూల వ‌ర్గాలు.. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. అంటే.. జ‌గ‌న్ చేసిన మంత్రి వ‌ర్గ కూర్పు పార్టీలో అసంతృప్తి సెగ‌లు పుట్టించిన నేప‌థ్యంలో వీరంతా. ఈ కార్య‌క్ర‌మానికి దూరంగా ఉన్నార‌ని.. ఇది త‌మ‌కు లాభిస్తుంద‌ని.. టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. ఎందుకంటే.. మాజీ మంత్రులు చాలా మంది గౌర్హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా ఉమ్మ‌డి గుంటూరు, ఉమ్మ‌డి కృష్ణా జిల్లాల నుంచి.. పెద్ద ఎత్తున నాయ‌కులు రావాల్సి ఉన్నప్ప‌టికీ.. ఎవ‌రూ రాలేదు.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం అనుకున్న విధంగా అయితే.. జ‌ర‌గ‌లేద‌ని.. స్ఫ‌స్టంగా తెలుస్తోంది. అంటే.. ఈ అసంతృప్తి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు అనుకూలంగా మారుతుంద‌ని..  నేత‌లు.. రేపు ఏదైనా మేజ‌ర్ డెసిష‌న్ తీసుకుం టే.. త‌మ పార్టీలో ద్వారాలు తెరిచి ఆహ్వానించి.. కండువా క‌ప్ప‌చ్చ‌నే భావ‌న‌తో ఉన్నార‌ని తెలుస్తోంది. మొత్తానికి ప్ర‌స్తుతం జ‌రిగిన ప‌రిణామం.. టీడీపీలో ఆశ‌లు రేకెత్తిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News