కాల్ మనీ... ఇప్పడు ఏపీలో అందరి నోళ్లలో నానుతున్న ఈ వ్యవహారంలో 600 కోట్లకు పైగా టర్నోవర్ అవుతోందని టాక్. అత్యవసర సమయానికి డబ్బు అందించే ఈ ఫెసిలిటీని ప్రైవేటు వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీల కోసం విజయవాడలో విస్తృతం చేయడమే కాకుండా ఆర్ధిక - లైంగిక దోపిడీ సాధనంగా మార్చేశారు.
అసలు బ్యాంకింగ్ పరిభాష ప్రకారం కాల్ మనీ అంటే పదిహేను రోజుల్లోపు కాలంలో ఒకరు మరొకరికి ఇచ్చే స్వల్పకాలిక రుణం. దాదాపుగా చేబదులు(హ్యాండ్ లోన్) వంటిది. అయితే.. దీనికి వడ్డీ తీసుకుంటారు. ఇది బ్యాంకులు - బ్యాంకులు మధ్య లావాదేవీల్లో బాగా వాడుతారు. నగదు నిల్వలు మెంటైన్ చేయడానికి ఇతర బ్యాంకులను సర్దుబాటు చేసుకునే విధానం. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ ఆర్)ని మెయిన్ టెయిన్ చేసేందుకు వాణిజ్య బ్యాంకులు ఒకదానికొకటి రుణాలిచ్చుకుంటాయి.
అయితే.. విజయవాడకు వచ్చేసరికి ఈ కాల్ మనీని ప్రైవేటు వ్యాపారులు మొదలుపెట్టారు. వడ్డీని - రుణాన్ని ఎప్పుడైనా వసూలు చేసుకోవచ్చన్న నిబంధనలున్న ఈ విధానాన్ని వడ్డీ వ్యాపారులు తమకు అనుకూలంగా మలచుకుని దందా చేస్తున్నారు. రుణం తీసుకున్న వ్యక్తి అసలు చెల్లించినప్పటికీ వడ్డీ కట్టాలంటూ వందలు - వేలు - వసూలు చేస్తున్నారు. చెల్లించలేనివారి ఆస్తులు తనఖా పెట్టుకోవడమో, వారి ఇంటి కాగితాలు స్వాధీనం చేసుకోవడమో చేస్తున్నారు. రుణం తీసుకున్నవారి ఇళ్లకు రౌడీలను పంపించి బెదిరించడం, అత్యాచారాలు చేస్తామంటూ హెచ్చరించడం చేస్తున్నారు. దీంతో వ్యవహారమంతా వెలుగుచూసి కలకలం రేగింది.
కాల్ మనీ దందాలో రాజకీయ నేతల ప్రమేయం కనిపిస్తోంది. 80 వేల అప్పు తీసుకున్న వ్యక్తి అదే రోజు రాత్రి లక్ష రూపాయలు చెల్లించాలనే దారుణమైన షరతులుంటాయి. చెల్లించకపోతే వడ్డీ ఇంకా పెరిగిపోతూనే వుంటుంది. రాజకీయ పార్టీల అండ దండలు చూసుకుని ఈ అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. పోలీసులమీద వత్తిడి పెరిగిపోవడంతో వాళ్ళు కూడా చేతులెత్తేస్తున్నారు. బెజవాడలో దాదాపు 300 మంది వ్యాపారుల నుంచి అప్పులు తీసుకొని, వేలాది మంది బాధితులుగా మారినట్లు తెలుస్తోంది. బాధితులు పుస్తెలు కూడా అమ్ముకున్నారు. ఆస్తులు రాసిచ్చిన వారూ ఉన్నారు. చివరకు కాల్ మనీ వసూళ్ల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. భర్త ఉండీ తాళి లేని పరిస్థితి పలువురు మహిళలు ఎదుర్కొంటున్నారు. లక్ష రూపాయలు ఇచ్చి.. వడ్డీ పేరుతో మూడు లక్షలు అంతకంటే ఎక్కువే వసూలు చేస్తున్నారు. మహిళలతో వ్యభిచారం చేయించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.
విజయవాడలోని ఆరు మార్కెట్ లలో ముఠా సభ్యులు వ్యాపారం చేస్తున్నారు. వారి లెక్కప్రకారం 20 రూపాయల వడ్డీ అయితే ఉదయం పూట 800 రూపాయలు ఇచ్చి సాయంత్రం పూట వేయి రూపాయలు వసూలు చేస్తారు. ఆటో నగర్‌లో ఈ వడ్డీ 30 రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం. ఆటోనగర్‌లో రోజుకు వంద కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుందని అంచనా. ఇలా బయటపడింది..
కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన ఓ మహిళా నేత ధైర్యం ప్రదర్శించి, చొరవ చూపడంతో కాల్ మనీ పేరుతో నడుస్తున్న కామాంధుల ముఠా గుట్టు రట్టయింది. ఆర్థికావసరాలను ఆసరా చేసుకుని మహిళలను లైంగికంగా వాడుకుంటున్న ఈ ముఠా అకస్మాత్తుగా వెలుగు చూసింది. పటమటకు చెందిన యలమంచిలి శ్రీరాముమూర్తి అలియాస్ రాము ఓ ప్రముఖ ఫైనాన్సియర్. కాల్ మనీకి ఇస్తూ మరోవైపు పెద్ద మొత్తాల్లో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈయన బిఎండబ్ల్యూ కారు వాడుతున్నాడు. ఇతనికున్న బడా వ్యక్తులు - పోలీసులు - అధికారుల పరిచయాలతో అరాచక కార్యకలాపాలు గత చాలాకాలంగా కొనసాగిస్తున్నాడు. పంటకాలువ రోడ్డులో రాము కార్యాలయం నిర్వహిస్తున్న బిల్డింగ్ యజమానిపై ఇతని అనుచరులు కొద్దిరోజుల క్రితం దాడికి పాల్పడ్డారు. ఓ గ్యాంగును నిర్వహిస్తున్న యలమంచిలి శ్రీను వద్ద బలమైన బౌన్సర్లు కూడా ఉన్నారు. దెబ్బలు తిన్న యజమాని శేషగిరిరావు పటమట పోలీసులను ఆశ్రయించగా ఇతనిపై రాము మనుషులే తిరిగి కౌంటర్ కేసు పెట్టారు. ఈవిషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో యలమంచిలి రాము కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఈక్రమంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు కూడా సీపిని కలిసి ఫిర్యాదు చేశారు. కుమార్తె కాలేజీ సీటు, ఫీజు కోసం ఆశ్రయించగా ఓ మహిళను ట్రాప్ చేయడంతోపాటు ఆ తర్వాత కుమార్తెను లొంగదీసుకుని లైంగిక చర్యలకు పాల్పడినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ రకంగా ఆర్ధిక సాయం, వడ్డీకి, కాల్‌మనీకి డబ్బు ఇస్తూ వీరి వద్దకు వచ్చే వారిని బలవంతంగా లోంగదీసుకుని వారిని స్టార్ హోటళ్ళకు తీసుకువచ్చి మద్యం తాగించి నగ్నంగా చిత్రీకరించడం, ఆపై తమ సిండికేట్ల వద్దకు పంపడం, రాజకీయనేతలు, ఉన్నతాధికారుల వద్దకు పంపి తమ వ్యక్తిగత పనులు చేయించుకోవడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతూ వస్తున్నారు. దీంతో పోలీసులు చొరవ తీసుకోవడం రాకెట్ గుట్టు బయటపడింది. ముఠా బారిన దాదాపు 200 మంది మహిళలు పడినట్లు పోలీసులు గుర్తించారు.