ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. భారత్ లోనూ విస్తరిస్తోంది. గడిచిన రెండు.. మూడు రోజులుగా చూస్తే.. ఈ కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సైతం అలెర్టు అయి.. రాష్ట్రాలకు పలు మార్గదర్శకాల్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ ఎంతకాలం వేధిస్తుందన్న ఆందోళన ఒకవైపు.. దీని తర్వాత వచ్చి పడే వేరియంట్లు ఎలా ఉంటాయన్నటెన్షన్ అందరిని వేధిస్తోంది. అయితే.. తాజాగా కేంబ్రిడ్జి పరిశోధకులు చేసిన అధ్యయనం ఆసక్తికరంగా మారింది. ఆ మాటకు వస్తే.. అందరికి రిలీఫ్ కలిగించే వ్యాఖ్యలు చేసింది. కరోనా కుటుంబంలో ఒమిక్రాన్ ఆఖరి ఆందోళన కలిగించే వేరియంట్ గా పేర్కొన్నారు.
ఒకవేళ ఫ్యూచర్ లో మరిన్ని మ్యూటెంట్లు చోటు చేసుకున్నా.. అవేమీ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు అంతేకాదు.. ఇకపై కరోనా ప్లూ సీజన్ తరహాలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైరస్ లో వచ్చే ఉత్పరివర్తనాలు దాని వ్యాప్తి.. వ్యాధి తీవ్రతను పెంచుతాయని.. అన్ని వైరస్ ల హాని తీవ్రత ఏదో ఒక దశలో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందన్నారు.
ఈ దశ తర్వాత ఎన్ని మ్యూటెంట్లు చోటు చేసుకున్నా.. రోగనిరోధక వ్యవస్థకు వెంటనే చిక్కకుండా తప్పించుకుంటాయే తప్పించి ప్రమాదరకరంగా మాత్రం మారవని చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ఇదే దశలో ఉందని.. దీని తర్వాత వచ్చే వేరియంట్లు మరణాల ముప్పును పెంచే అవకాశాల్లేవని పేర్కొన్నారు. కాకుంటే.. వ్యాప్తి మాత్రం పెద్ద ఎత్తున జరిగే వీలుందని చెబుతున్నారు. తర్వాతి రోజుల్లో కొత్త వేరియంట్లు పుట్టుకు రావొచ్చు కానీ.. ప్రమాదకరంగా మారే అవకాశం లేదంటున్నారు. సాధారణ జలుబు కలిగించే స్థాయికి సార్స్ కోవ్ 2 వైరస్ మిగిలే వీలుందంటున్నారు. గతంలో కొవిడ్ బారిన పడటం.. టీకాలు తీసుకోవటం కారణంగా మనుషుల్లో కరోనా కు వ్యతిరేకంగా బలమైన రోగ నిరోధక వ్యవస్థ ఏర్పడుతుందని.. అదే కొవిడ్ తీవ్రతను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. సో.. తాజా ఒమిక్రాన్ గండం నుంచి గట్టెక్కితే కరోనా గండం నుంచి తప్పించుకున్నట్లే అవుతుందన్న మాట.