వెంటిలేషన్ వ్యవస్థతో కరోనా ముప్పు అధికం

Update: 2020-10-01 23:30 GMT
కరోనా గాలి ద్వారా.. ఒకరిని ఒకరు తాకడం వల్ల వస్తుందని.. దీన్నొక అంటు వ్యాధిగా అందరూ తేల్చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి, సంక్రమణపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. కరోనా రోగి తుమ్మినా.. దగ్గినా.. మాట్లాడినా వచ్చే తుంపర్ల వల్ల వైరస్ వ్యాపిస్తున్నట్టుగా తేలింది.

అయితే తాజాగా కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో కొత్త విషయం వెలుగుచూసింది. ఈ పరిశోధన ఫలితాలను జర్నలల్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ప్రచురించారు.

తాజా పరిశోధనలో కార్యాలయాల్లో ఉష్ణోగ్రతలను నియంత్రించే వెంటిలేషన్ వ్యవస్థ వల్ల కరోనా వైరస్ సోకే ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.

సహజంగా వెంటిలేషన్ ప్రదేశాలు.. బహిరంగ పరిస్థితులలో మార్పులపై మాస్క్ ప్రభావవంతంగా పనిచేస్తోందని కేంబ్రిడ్జి పరిశోధనలో తేలింది. కదిలకలు, తలుపులు తెరవడం.. మూసివేయడం.. సహజంగా వెంటిలేషన్ ప్రదేశాల్లో కరోనా ముప్పు అధికంగా ఉంటుందని తేలింది. శ్వాస ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో మాస్క్ ప్రభావం చూపుతోందని గుర్తించారు.
Tags:    

Similar News