కోహ్లీ ఆ పని చేసేటప్పుడు కూడా కెమేరా తన పని తాను చేయాల్సిందేనా?

Update: 2022-05-26 04:21 GMT
క్రికెట్ ను అభిమానించే భారతీయులు అత్యధికంగా అభిమానించి.. ఆరాధించే క్రీడాకారుడు విరాట్ కోహ్లీ. క్రికెట్ మైదానంలో అతను ఎంత అగ్రెసివ్ గా ఉంటారో.. విడిగా ఉన్నప్పుడు అందుకు భిన్నంగా ఉంటారన్న వాదన ఉంది. ఈ మాటను బలపరిచేలా తాజా ఉదంతం ఒకటి బయటకు వచ్చింది.

కోహ్లీ మైదానంలో ఉన్నప్పుడు.. అతడ్ని మ్యాగ్జిమం కవర్ చేసే కెమేరాలు.. అతను చేసే ప్రతి పనిని రికార్డు చేయటానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎందుకంటే.. కోహ్లీకి ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే.. అలాంటోడికి సైతం కొన్ని సందర్భాల్లో ప్రైవసీ అవసరమన్న విషయాన్ని వదిలేసి.. కెమేరా మ్యాన్ తన పని తాను చేసుకుంటూ పోయిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ కు ముందు చోటు చేసుకున్న ఉదంతాన్ని చూస్తే.. పాపం కోహ్లీ అన్న భావన కలుగక మానదు. అలాంటి పని చేసేటప్పుడు కూడా కెమేరా అతన్ని వదలకుండా కవర్ చేయటమా? అన్న షాకింగ్ ఫీలింగ్ కలుగక మానదు.

క్రికెట్ గేమ్ ఆడే ప్రతి సందర్భంలోనే ఆటగాడు విధిగా గార్డు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా కోహ్లీ సైతం గార్డు పెట్టుకునే వేళలో.. కెమేరా యాంగిల్ అతని వైపు తిరిగింది. దీంతో.. కెమేరా మ్యాన్ కు అర్థమయ్యేలా.. తాను గార్డు పెట్టుకోవాల్సి ఉందని.. కెమేరా యాంగిల్ ను పక్కకు తిప్పాలంటూ కోహ్లీ సైగలు చేశాడు.

అయినా అదే పట్టించుకోని కెమేరా మ్యాన్ తీరుతో చేసేదేమీ లేక.. కోహ్లీ తన షర్ట్ ను తీసి ఫ్యాంట్ లోపల గార్డును పెట్టేసుకున్నాడు. అనంతరం కెమేరా వైపు చూస్తూ.. కాస్త ప్రైవసీ ఇవ్వవా? అన్నట్లుగా సీరియస్ గా ఒక చూపు చూసిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది. నిజమే.. ఎంత క్రేజ్ ఉన్న ఆటగాడికైనా కొన్ని సందర్భాల్లో ఇవ్వాల్సినంత ప్రైవసీ ఇవ్వాలి కదా? అలాంటిదేమీ లేకుండా కెమేరా తన పని తాను చేసుకుంటూ పోవటం ఏమిటి?
Tags:    

Similar News