ప్రతి మగవాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. కానీ కామెరూన్ దేశానికి చెందిన ఓ గిరిజన రాజు విజయం వెనక 100 మంది స్త్రీలు ఉన్నారు! అవును మీరు చదివింది నిజమే. ఆ దేశంలో బఫుట్ అనే గిరిజన ప్రాంతం ఉంది. దానికి రాజు అబుంబి. అక్కడి సంప్రదాయం ప్రకారం రాజు ఎవరైన మరణిస్తే అతని వారసుడు రాజుగా బాధ్యతలు స్వీకరిస్తాడు. అయితే బాధ్యతలు మాత్రమే కాదు మిగతావన్నీ కూడా స్వీకరించాలి. అంటే తండ్రి ఆస్తులు, తండ్రి భార్యలని కూడా!కరెక్టుగా చెప్పాలంటే కొత్త రాజుకు తల్లి వరస అయ్యే వారిని కూడా భార్యలుగా స్వీకరించాలి. ఇందులో భాగంగానే అబుంబి రాజు తన తండ్రి అచిరింమి-2 మరణంతో తల్లి వరస అయ్యే స్త్రీలను తన భార్యలుగా చేసుకున్నాడు. ఈ సంఖ్య పదుల సంఖ్యలో ఉండటం విశేషం.
తండ్రి అచిరింమి-2 మరణించిన నాటికి ఆయనకు 72 మంది భార్యలు. ఆయన మృతితో ఆ 72 మంది భార్యలను వారసుడు అబుంబి-2 తన భార్యలుగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకొంత మంది మహిళలను వివాహం చేసుకోవడంతో రాజుగారి భార్యల సంఖ్య 100కు చేరింది. 100 మంది భార్యలకు కలిపి సంతానం ఎంతో తెలుసా? 500 మంది పిల్లలు!! ఈ వంద మంది భార్యలు రాజుగారి పరిపాలనలో సహాయం చేస్తారట. ఇదండ అబుంబి రాజుగారి వంద భార్యలు, 500 పిల్లల సంఖ్య.