దేశంలో అయితే ప్రత్యేక రాష్ట్రాలు కావాలని ఉద్యమాలు చేస్తారు... మరి అమెరికా వంటి ఖండంలో వేరు కుంపటి పెట్టాలంటే ఏమి చేయాలి? ఈ విషయంలో కాలిఫోర్నియా వాసులు ఒక ప్రకటన చేస్తున్నరు. వారి నినాదాల్లో ఈ విషయన్ని కూడా కలుపుతున్నారు. అమెరికాలోని రాష్ట్రాలు విడిపోయి దేశాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కాలిఫోర్నియా "కాల్ ఎగ్జిట్" అంటుంటే.. టెక్సాస్ "టెగ్జిట్" అంటోంది. ట్రంప్ పాలనలో సంయుక్తరాష్ట్రాలుగా కలిసి ఉండే కంటే.. విడిపోయి బలుసాకు తిని బతకొచ్చని వీరు భావిస్తున్నారట!
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడమే ఒక రికార్డు అని కొందరంటుంటే... ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రజల తిరుగుబాటు మరో రికార్డు సృష్టించబోతున్నట్లుంది. ట్రంప్ మాకు అధ్యక్షుడు కాడు.. అంటూ అమెరికా వ్యాప్తంగా డెమొక్రాట్లు ప్లకార్డులు చేతపట్టి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ విషయంలో హిల్లరీకి ఎక్కువ ఓట్లు పడిన కాలిఫోర్నియా రాష్ట్రంలో అయితే ట్రంప్ ఎన్నికతో ఏకంగా తమ రాష్ట్రం అమెరికా నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారు. "ఎస్ కాలిఫోర్నియా" అనే బృందం ఇప్పటికే ఈ మేరకు శాక్రిమెంటోలో ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడాన్ని "బ్రెక్జిట్" అన్నట్టుగానే, తమ రాష్ట్రం విడిపోవడాన్ని "కాల్ ఎగ్జిట్"గా వారు వ్యవహరిస్తున్నారు. ఈ పోరాటంతో 2020 నాటికల్లా అమెరికా నుంచి విడిపోయి కాలిఫోర్నియా దేశంగా ఆవిర్భవించేలా చేయడమే వారి లక్ష్యమట.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో తమకు ఇప్పటికే పలువురు కాలిఫోర్నియా వాసులు మద్దతు తెలుపుతున్నారని చెబుతున్న ఈ బృందం... ట్విటర్ లో కాల్ ఎగ్జిట్ పేరుతో హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయని అంటున్నారు. ఇదే క్రమంలో కొందరు టెక్సాస్ వాసులు కూడా వీరి బాటలోనే నడుస్తు అమెరికా నుంచి టెక్సాస్ ఎగ్జిట్ ను వీరు "టెగ్జిట్"గా వ్యవహరిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/