కరోనా వైరస్ ...ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి. ఈ కరోనా దెబ్బకి మొత్తం ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయ్యింది. ఇకపోతే , ఈ కరోనా వైరస్ భారిన పడి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 7.3 లక్షల మంది కి కరోనా పాజిటివ్ గా తేలింది. 34 వేల మంది ఈ కరోనా కారణంగా మృతిచెందారు. ఇకపోతే , ఈ కరోనా వైరస్ ఇండియా లో కూడా క్రమక్రమంగా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు 1000 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. వారిలో 29 మంది మృతిచెందారు.
ఇకపోతే , ఈ కరోనా వైరస్ ఇప్పటివరకు ..కరోనా వైరస్ సోకిన వ్యక్తి తాకిన చోటుని తాకడం వల్ల కానీ, కరోనా సోకిన వ్యక్తిని తాకడం వల్ల కానీ ఈ కరోనా వ్యాప్తి చెందుతుంది అని చెప్తున్నారు. కానీ , తాజాగా ఈ కరోనా కళ్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది అని చెప్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిలో కళ్లు ముఖ్యపాత్ర వహిస్తున్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగర్వాల్ కంటి ఆస్పత్రి వైద్యసేవల విభాగం డాక్టర్ ప్రీతి రవిచందర్ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ను నివారించడంలోనూ, వ్యాపింపజేయడంలోనూ కళ్లు ముఖ్య పాత్ర వహిస్తున్నాయని తెలిపారు.
వ్యక్తులు దగ్గినప్పుడు నీటి కణాలు కంట్లోకి పడినా కరోనా వైరస్ వ్యాపిస్తుందన్నారు. ఈ వైరస్ దేహంలోని అన్ని భాగాలకు చేరుతుందని, తద్వారా ప్రాణాపాయం కలుగుతుందని వివరించారు. సబ్బుతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, వేడి నీరు, వేడి ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిదన్నారు. నీటిని వీలైనంత ఎక్కువసార్లు తాగాలన్నారు. ఎన్ని రకాలుగా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి , ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం చెప్పిన సూచనలు , సలహాలు పాటించండి ..కరోనా ని నివారించడానికి సహకరించండి.