కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ చానాళ్ల తర్వాత మాంచి పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పారు. పంజాబ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తమ పార్టీకి కానీ అధికారాన్ని అందిస్తే.. పంజాబ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న డగ్ర్స్ మాఫియాను నెలలో ఖతం చేస్తామని చెబుతున్నారు. మత్తుపదార్థాల వినియోగం పంజాబ్ లో తీవ్రంగా పెరిగిపోయినట్లుగా ఆరోపించిన ఆయన.. ఆ రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని.. పంజాబ్ రాష్ట్రంలోని బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాళీదళ్ పై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్.. తమ చేతికి అధికారం అందిస్తే డ్రగ్స్ మాఫియాను నెలలో తేల్చేస్తామన్నారు. పంజాబ్ రాష్ట్ర సర్కార్ డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఒకవేళ అదే నిజమైతే.. రెండేళ్ల ముందు కేంద్రంలో కొలువు తీరి ఉంది యూపీఏ సర్కారే. పవర్ తమ చేతిలో ఉన్నప్పుడు.. పంజాబ్ విషయంలో ఎందుకు పట్టనట్లుగా ఉన్నట్లు?
ఇప్పుడు లేవనెత్తుతున్న డ్రగ్స్ ఇష్యూను తమ చేతిలో పవర్ ఉన్నప్పుడు రాహుల్ ఎందుకు ప్రస్తావించలేదు? ఎందుకు ఫోకస్ చేయలేదు? పవర్ చేజారిన వెంటనే.. పంజాబ్ లో నెలకొన్నాయంటూ వేలెత్తి చూపిస్తున్న డ్రగ్స్ గురించి గతంలో యువరాజా వారికి ఎందుకు గుర్తుకు రాలేదు? అప్పుడు గుర్తుకు రానివన్నీ ఇప్పుడు గుర్తుకు రావటం వెనుక మర్మం ఏమిటి యువరాజా..?