ప్రత్యేక హోదా డిమాండ్ సాధన కోసం టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయటానికి సిద్ధమంటూ చంద్రబాబునాయుడు ప్రకటించటం విచిత్రంగానే ఉంది. వైసీపీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తే టీడీపీ ముగ్గురు ఎంపీలు కూడా రాజీనామాలు చేసేస్తారని జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇఛ్చారు. హోదా సాధనపై జగన్ కు చిత్తుశద్ది ఉంటే తన ఎంపీలతో రాజీనామాలు చేయించాలని చాలెంజ్ కూడా విసిరారు చంద్రబాబు. ఇక్కడ విషయం ఏమిటంటే తాను అధికారంలో ఉన్నపుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఇదే చాలెంజ్ చేస్తే చంద్రబాబు పట్టించుకోలేదు.
మరిపుడు అదే చాలెంజ్ తాను చేస్తే జగన్ పట్టంచుకుంటానని చంద్రబాబు ఎలా అనుకున్నారు ? అప్పట్లో ఛాలెంజ్ చేసిన జగన్ చంద్రబాబు వైఖరి ఏమిటో బాగా అర్ధం చేసుకున్నారు. అందుకనే తన చిత్తశుద్దిని నిరూపించుకునేందుకు వైసీపీ 5 మంది ఎంపీలతో రాజీనామాలు చేయించారు. రాజీనామాల తర్వాత ఎంపీలతా ఏపీ భవన్లో నిరాహార దీక్ష కూడా చేశారు. అప్పట్లో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా, దీక్షలు చేసినా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు.
మరిపుడు అదే డిమాండ్ తో తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని చెప్పి వైసీపీ ఎంపీలను రాజీనామాలు చేయాలని డిమాండ్ చేయటంలో అర్ధంలేదు. అప్పట్లో జగన్ చాలెంజ్ కు చంద్రబాబు సానుకూలంగా స్పందించి తన ఎంపీలతో రాజీనామాలు చేయించుంటే ఇఫుడు వైసీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించమని డిమాండ్ చేసినా అర్ధముంది. ఒకవేళ ఎంపీలు రాజీనామాలు చేయకపోతే జగన్ పై ఒత్తిడి తేవటంలో తప్పేలేదు. అప్పుడు జనాల ముందు జగనే దోషిగా నిలబడతారు.
తన చాలెంజ్ కు చంద్రబాబు స్పందించరని అర్ధమైపోయిన తర్వాత జగనో చొరవ తీసుకున్నారు. తన పార్టీ ఎంపీలు ఐదుగురితో రాజీనామాలు చేయించారు. తన ఎంపీలతో రాజీనామాలు చేయించి జగన్ తన చిత్తశుద్దిని నిరూపించుకున్నారు. కాబట్టి ఇపుడు చంద్రబాబు కూడా వైసీపీ ఎంపీల రాజీనామాల కోసం చూడకూడదు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా చేయకపోయినా తన ఎంపీలతో రాజీనామాలు చేయించి చంద్రబాబు తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. వైసీపీ ఎంపీల రాజీనామాలు తన చేతిలో లేవు కానీ టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించటం తన చేతిలోనే ఉన్నాయి కదా.