కేరళను ముంచెత్తిన ప్రకృతి ప్రళయం వారూ వీరు అన్న తేడా లేకుండా అందరిని కదిలిస్తోంది. దేశీయంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కేరళకు అండగా తామున్నామంటూ పలువురు ముందుకు వస్తున్నారు. ఇక.. సెలబ్రిటీలు అయితే.. తమ వంతు సాయంగా ప్రకటనల మీద ప్రకటలు చేయటమే కాదు.. తమ అభిమానులను కూడా సాయం చేయాలని కోరుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అయితే.. తన నెలసరి జీతాన్ని కేరళ వాసులకు ఇవ్వటమే కాదు.. మిగిలిన సహచరులను కోరి.. తెలంగాణ ప్రజాప్రతినిధులు స్పందించేలా చేశారు. ఇదిలా ఉంటే.. కేరళలో జరిగిన దారుణ ప్రకృతి బీభత్సం మీద కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విచారాన్ని వ్యక్తం చేశారు.
వరదల ధాటికి పెద్ద ఎత్తున మరణించటంపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తాజాగా కేరళలోని జల విలయం గురించి ట్వీట్ చేసిన ఆయన.. తాను భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా కేరళ అందాల గురించి చెప్పారని.. అంతటి గొప్ప ప్రదేశం ఇప్పుడు వరద గుప్పిట్లో చిక్కుకుపోవటం దురదృష్టకరమన్నారు.
వరదల కారణంగా ఎంతోమంది మరణించారని.. వారందరి తన సంతాపాన్ని ఆయన తెలియజేశారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ ట్వీట్ చేశారు. వందేళ్ల క్రితం చోటు చేసుకున్న భారీ వరదలు.. మళ్లీ ఇన్నాళ్లకు కేరళను ముంచెత్తటం.. కేరళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని రవాణా వ్యవస్థలన్ని చిన్నాభిన్నం అయ్యాయి.
తాగునీరు లేక దీనంగా అలమటిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. ఇప్పటివరకూ 385 మంది ప్రాణాలు కోల్పోయారు. 3.14 లక్షల మంది పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతుననారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ మాత్రం ఇప్పటివరకూ రూ.100 కోట్ల తక్షణ సాయాన్ని మాత్రమే ప్రకటించటం గమనార్హం.