హమ్మయ్యా..కెనడా పీఎం మిసెస్ కోలుకున్నారు

Update: 2020-03-29 13:58 GMT
నిజంగానే ఇది మంచి వార్తే. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి సోకి దాదాపుగా 16 రోజుల పాటు చికిత్స తీసుకున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సతీమణి సోఫీ గ్రెగరీ పూర్తిగా కోలుకున్నారు. ఈ మేరకు సోఫీకి చికిత్సలు అందజేసిన వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రాణాంతక వైరస్ గా పరిణమించిన కరోనా వైరస్ కు చిక్కి... ఆ వైరస్ ను జయించి ప్రాణాలతో బయటపడటమంటే నిజంగానే మంచి వార్తే కదా. ప్రస్తుతం కరోనా వచ్చిందంటేనే... ప్రాణాలు అరచేతబట్టుకుంటున్న వేళ... ఏకంగా ఓ దేశ ప్రధాని సతీమణి ఆ వైరస్ ను జయించి ప్రాణాలతో బయటపడటం నిజంగా మంచి వార్తే కదా.

ఇక సోపీకి వైరస్ సోకిన వైనం వివరాల్లోకి వెళితే... సోఫి గ్రెగొరీ మార్చి 12న లండన్‌ లోని ఓ కార్యక్రమానికి హాజ‌రయ్యారు. అనంతరం స్వల్ప జ్వరం రావడంతో ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు... ఆమెకు కరోనా వైరస్‌ సోకిందని నిర్దారించారు. దీంతో అప్పటికే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయిన ఆమెకు తగిన చికిత్స అందించారు. తన సతీమణికి కరోనా సోకిందని నిర్ధారణ కావడంతో ప్రధాని ట్రూడో కూడా ఇంత కాలం ఇంటి నుంచే విధులు నిర్వరించారు.

కాగా.. కరోనా వైరస్ నుంచి పూర్తి కోలువడంతో చాలా సంతోషంగా ఉందంటూ సోఫీ గ్రెగోరి ఆనందం వ్యక్తం చేశారు. కరోనాపై తాను విజయం సాధించానన్న రీతిలో సోఫీ ఆసక్తికర ప్రకటన చేశారు. స్వయంగా ప్రధానమంత్రి సతీమణి అయి ఉండి కరోనా బారిన పడిన నేపథ్యంలో సోపీ మానసికంగా తీవ్రంగా మదనపడిన వైనం మనకు తెలిసిందే. అయితే అదే సమయంలో సదరు కరోనా వైరస్  ను ధైర్యంగా ఎదుర్కొని దాని నుంచి ప్రాణాలతో బయటపడి... కరోనా అంటే అంతగా భయపడాల్సిన అవసరం లేదని - వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళన... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస సోకినా...ఏమాత్రం మనోధైర్యం కోల్పోకుండా వైరస్ పై పోరు సాగించాలన్న దిశగా సోఫీ ప్రపంచ దేశాల ప్రజలకు సందేశాన్ని ఇచ్చినట్టైంది.
Tags:    

Similar News