కరోనా నేపథ్యంలో ఆన్ లైన్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూమ్ మీటింగ్ లో మిగతా ఎంపీలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో ఒక ఎంపీ దుస్తులన్నీ విప్పేసి బేర్ బాడీతో లైన్లోకి వచ్చాడు. అంతేకాదు.. అందరూ చూస్తుండగా కాఫీ కప్పులో మూత్రం పోశాడు. కెనడాలో జరిగిన ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఆ ఎంపీ పేరు విలియమ్ ఆమోస్. గత రాత్రి కెనడా పార్లమెంట్ సమావేశాలను ఆన్ లైన్ లో నిర్వహించారు. అయితే.. ప్రజా సమస్యలను చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఈ బాగోతం నడిపించడం గమనార్హం. కాగా.. ఆమోస్ ఇప్పుడే కాదు, గతంలోనూ ఓ సారి ఇలాగే చేశాడు. కొన్ని నెలల క్రితం జరిగిన సమావేశాల్లో.. అందరూ చూస్తుండగానే నగ్నంగా మారిపోయి, దుస్తులు మార్చుకున్నారు. అప్పుడేదో పొరపాటు జరిగిందని సారీ చెప్పాడు. ఇప్పుడు ఏకంగా నగ్నంగా తయారై, కాఫీ కప్పులో మూత్రం పోవడం అందరినీ షాక్ కు గురిచేసింది.
కాగా.. ఇప్పుడు కూడా పొరపాటు జరిగిందని చెప్పడం గమనార్హం. కెమెరా ఆన్ లో ఉందన్న సంగతి తాను మరిచిపోయానని, తన ప్రవర్తన ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని కోరడం విశేషం. అయితే.. ఏదేమైనా తాను చేసింది తప్పే కాబట్టి.. పార్లమెంటరీ సెక్రటరీ పదవి నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
అయితే.. కనీస స్పృహ ఉన్నవారు ఎవరైనా ఈ విధంగా చేసే అవకాశమే లేదు. మరి, ఆ ఎంపీ వరుసగా ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారనేది మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు.