కరోనా పుణ్యమా అని ట్రైన్ జర్నీఅన్నదే మానేశారు. ఆ మాటకు వస్తే.. ప్రయాణాలే తగ్గిపోయాయి. కరోనా కేసుల సంగతి ఎలా ఉన్నా.. నెలల తరబడి ఇళ్లకే పరిమితవుతున్న వారు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో రైలు బండ్లు కూడా ఒక్కొక్కటిగా పట్టాలు ఎక్కుతున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధానాల్ని తీసుకొస్తోంది రైల్వే శాఖ.
అందులో భాగంగానే ప్రయాణానికి 5 నిమిషాల ముందు కూడా రిజర్వేషన్ సౌకర్యాన్నికల్పిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మాదిరి కాకుండా కొత్తగా తీసుకొచ్చిన విధానంలో ట్రైన్ బయలుదేరటానికి అరగంట ముందు రెండో చార్ట్ ప్రిపేర్ చేస్తారు. రైలు కదలటానికి ఐదు నిమిషాల ముందు వరకు రిజర్వేషన్ టికెట్లను విక్రయిస్తారు. అదే సమయంలో.. ట్రైన్ కదలటానికి ఐదు నిమిషాల ముందు వరకు టికెట్ ను రద్దు చేయటానికి వెసులుబాటు కల్పించనున్నారు.
ఈ కొత్త సౌకర్యాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తారు. రైలు బయలుదేరటానికి నాలుగు గంటల ముందు రిజర్వేషన్ టికెట్ ను రద్దు చేసుకునే వీలుంది. తర్వాత రద్దు చేసుకున్నా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. తాజాగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం.. రైలు ప్రయాణానికి ఐదు నిమిషాల ముందు వరకు టికెట్ ను రద్దు చేసుకునే వీలు కల్పిస్తున్నారు.