వేల మాటలు చెప్పలేని విషయాల్ని ఒక దృశ్యం చెబుతుంది. అలాంటిదే ఈ వీడియో. సమాచార సునామీ విరుచుకుపడుతున్న వేళ.. నిత్యం వందల ఫోటోలు.. పదుల సంఖ్యలో వీడియోలు చూసే వారు.. అబ్బో అంత గొప్ప వీడియోనా? అని అనొచ్చు. కానీ.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. మౌనంగా ఉండిపోవటం ఖాయం. డిజిటల్ యుగంలో ప్రతి విషయాన్ని లైట్ తీసుకుంటున్న వేళ.. విపరీతమైన భావోద్వేగానికి గురి చేసే ఈ వీడియోలోకి వెళితే..
ఆసుపత్రి బెడ్ మీద ఏ మాత్రం శక్తి లేనట్లుగా పడి ఉన్న ఆమె పేరు రీబాన్ చిలీ. 49 సంవత్సరాల చిలీ ప్రస్తుతం కేన్సర్ తో బాధపడుతోంది. రోజురోజుకీ ఆమె ఆరోగ్యం విషమిస్తున్న దుస్థితి. మరణానికి చేరువైన వేళ.. తనకు వైద్యం చేస్తున్న డాక్టర్లను ఒక కోరిక కోరింది. తానెంతో అల్లారు ముద్దుగా పెంచుకునే కుక్కను తన వద్దకు తీసుకురావాలని కోరింది. అందుకు సరేనన్న డాక్టర్లు.. ఆమె కుక్కను తీసుకొచ్చారు.
బెడ్ మీద కనిపించిన యజమానురాలిని చూసినంతనే ఆ కుక్క తోక ఊపుకుంటూ మంచం దగ్గరకు వచ్చి.. ఆమె శరీరాన్ని అప్యాయంగా తడిమింది. యజమానురాలి ఆరోగ్యం బాగోలేదన్న విషయం అర్థం చేసుకుందో ఆమెను చూసేందుకు ప్రయత్నించింది. యజమానురాలి ముఖాన్ని కప్పేస్తున్న మాస్క్ ను తొలగించే ప్రయత్నం చేసింది. అంతే.. అక్కడున్న డాక్టర్లు వెంటనే ఆమె మాస్క్ ను సరి చేశారు. ఇక..రీబాన్ తన పెంపుడు కుక్కను చూసి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లుగా అలా పొదివి పట్టుకుంది. కాసేపు ఒళ్లంతా తడిమింది. దూరం నుంచి ఇదంతా చూస్తున్న వైద్యులు సైతం కళ్ల నీళ్లు పెట్టుకున్న ఉదంతమిది. గత సంవత్సరం బ్రెజిల్ లోని ఒక ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ వీడియోను కొద్దిరోజుల క్రితం పోస్ట్ చేశారు. లక్షలాది మంది గుండెల్ని ఈ వీడియో పిండేస్తోంది. ఎంత డిజిటల్ యుగంలో అయినా మనిషి మనసులో భావోద్వేగాలు ఇంకా ఇరిగిపోలేదన్న వాస్తవాన్ని ఈ వీడియో చెప్పకనే చెప్పేసింది.
Full View