ఎన్నికలంటే అభ్యర్థులు ఎన్నో కళలు చూపించాల్సిన సమయం... ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు వ్యూహాలు రచించడమే కాదు... వారిని ఆకట్టుకోవడానికి సరదాసరదా పనులు... చిత్రవిచిత్రమైన వేషాలూ వేస్తుంటారు. తాజాగా బీహార్ లోనూ ఇలాంటి వేషాలు వేసేవారికి కొదవేలేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఏకంగా దున్నపోతుపై ఎక్కి వచ్చాడు.
బిహార్ లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంటుగా బరిలోకి దిగిన మనోజ్ యాదవ్ నామినేషన్ వేయడానికి కలెక్టరేట్ కి ఏకంగా దున్నపోతుపై ఊరేగుతూ వచ్చారు. అయితే, సరిగ్గా అక్కడికి వచ్చాక ఆ దున్నపోతు అక్కడ ఉన్న జనాన్ని చూసి బెదిరిపోయింది. కొంత గందరగోళం కూడా సృష్టించింది. దీంతో మనోజ్ యాదవ్ దాని మీద నుంచి ఎలాగోలా కిందపడకుండా జాగ్రత్తగా దిగారు. తమ నేతకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అతని అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత తన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు మనోజ్ యాదవ్.
యమధర్మరాజులా దున్నపోతుపై వచ్చిన అభ్యర్థిని గెలిపిస్తే ధర్మం న్యాయం ఎలా చెబుతాడో కానీ ప్రాణాలు ఎత్తుకుపోతే ప్రమాదమంటూ ఆయన ప్రత్యర్థి నాయకులు అంటున్నారు.