కరోనా తో భారత్ కి రాలేకపోయా ...త్వరలోనే వస్తా : యూకే ప్రధాని

Update: 2021-01-26 17:30 GMT
భారతదేశం 72 వ రిపబ్లిక్ డే వేడుకలకి ఈ సారి యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆహ్వానించ‌గా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేప‌థ్యంలో ఆయ‌న రాలేక‌పోయిన విష‌యం తెలిసిందే. ఈ రోజు భార‌త్ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ‌ వేడుక జ‌రుపుకుంటోన్న‌‌ నేప‌థ్యంలో ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలుపుతూ వీడియో సందేశం పంపారు. కరోనా వైరస్ క‌ట్ట‌డి కోసం భారతదేశంతో కలిసి యూకే పనిచేస్తుందని చెప్పారు.

అలాగే, వ్యాక్సిన్ సహకారంలో ఇరు దేశాలు క‌లిసి పనిచేస్తున్నాయని అన్నారు. త‌న‌ స్నేహితుడు ప్రధాన మంత్రి మోదీ ఆహ్వానం మేరకు భార‌తీయుల‌ను కలవాలని తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశానని,  అయితే, క‌రోనా కార‌ణంగా తాను బ్రిట‌న్ ‌లోనే ఉండిపోయాన‌ని చెప్పారు.

కరోనా కారణంగా ప్రజలంతా దూరంగా ఉండాల్సి వస్తోందని చెప్పారు. బ్రిటన్, భారత్ ‌కు మధ్య వారధిగా ఉన్న అనేక మంది ప్రవాస భారతీయులు కూడా ఒకరికొకరు కలుసుకోలేకపోతున్నారని చెప్పారు. వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయడానికి ఇరు దేశాలు చేస్తోన్న‌ సమష్టి కృషికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. తాను ఈ ఏడాది చివర్లో భారతదేశ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తాన‌ని అన్నారు. బ్రిటన్ లో భారత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రజలకు కూడా ఆయ‌న శుభాకాంక్షలు చెప్పారు. భారత గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధానిని ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, బ్రిటన్‌లో కరోనా కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి కారణంగా ఆయన తన భారత్ పర్యటను రద్దు చేసుకున్నారు.
Tags:    

Similar News