ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. బీఏసీలో నిర్ణయం తర్వాత రెండు రోజుల పాటు శాసనసభ, మండలి నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఈ రెండు రోజుల్లో తొలిరోజు అసెంబ్లీలో సాధారణ బడ్జెట్ తో పాటు వ్యవసాయ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోంది. ఆ తర్వాత మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.
ఈ 8 బిల్లుల్లో సీఆర్డీయే బిల్లు ఉండబోతోందని ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు.
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం, అసెంబ్లీలో ఆమోదింపజేసుకుంది. కానీ ,సరైన సంఖ్యా బలం లేకపోవడంతో శాసనమండలిలో మాత్రం మూడు రాజధానుల బిల్లును గట్టెక్కించుకోలేకపోయింది. అయితే ఈ బిల్లుపై శాసనమండలి 90 రోజులు పూర్తయినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మరోసారి అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తమ ప్రభుత్వానికి అన్ని ప్రాంతాలు సమానమే అని విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపేందుకు ప్రభుత్వం కసరత్తు చేయబోతోందా అన్న అంశంలో పూర్తిగా క్లారిటీ లేదు. చూడాలి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ...