బాబు పై ప‌వన్‌ కు అమ‌రావ‌తి రైతుల ఫిర్యాదు

Update: 2017-02-20 13:10 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం రైతుల వ‌ద్ద నుంచే భూములు స‌మీక‌రిస్తున్నామ‌ని చెప్తుండ‌గా రైతుల్లో ఉన్న అసంతృప్తి బ‌య‌ట‌ప‌డింది. చేనేత సత్యాగ్రహ దీక్షకు వెళ్తున్న జనసేత అధినేత పవన్‌ కల్యాణ్‌ ను అమ‌రావ‌తి స‌మీపంలోని హాయ్‌ ల్యాండ్‌ లో అమరావతి లంక భూముల రైతులు కలిశారు. గతంలో రాజధాని రైతుల సమస్యలను పవన్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామ‌ని అయినా ప్రభుత్వం తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు పవన్‌ ముందు మొరపెట్టుకున్నారు. పెనమాక - ఉండవల్లి - బేతపూడి రైతులు పవన్‌ ను కలుసుకున్న వారిలో ఉన్నారు.

గత ఏడాది మొట్టమొదటి సారిగా రాజ‌ధాని ప్రాంతం ప‌రిధిలోకి వ‌చ్చే మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతులు ప్రజావేదికను ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం భూసేకరణ చట్టం అమలు చేస్తామని ప్ర‌భుత్వం ప్రకటించినప్పుడు పవన్‌ కల్యాణ్‌ నేరుగా రాజధాని ప్రాంతానికి వచ్చి.. బహిరంగ వేదికపై ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. బలవంతంగా రైతుల దగ్గర్నుంచి భూములు లాక్కోవద్దని.. అలాచేస్తే తాను చూస్తూ ఊరుకోనంటూ హెచ్చరించారు. ఆమేరకు ప్రభుత్వం సైతం ఒక మెట్టు దిగి వచ్చి భూసేకరణ ప్రయోగానికి స్వస్తి పలికింది.  అయితే అనంత‌రం మ‌ళ్లీ భూములు తీసుకోవ‌డానికి ముందుకు రావ‌డంతో మంగళగిరి మండలం నవులూరు - ఎర్రబాలెం - కురగల్లు గ్రామాల రైతులు జనసేన బ్యానర్‌ లు - ఫ్లెక్సీలు కట్టారు. ఆ స‌మ‌యంలో బాధిత రైతులంతా జనసేన జెండా పట్టాలని సన్నాహాలు చేస్తున్నారని వార్త‌లు వెలువ‌డ్డాయి. తాజాగా ఈ ప్రాంత రైతులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను క‌ల‌వ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.

కాగా, ఈ రోజు చేనేత స‌త్యాగ్ర‌హ దీక్ష‌కు వెళుతున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సంద‌ర్భంగా జనసేన కార్యకర్తలు - అభిమానులు పవన్‌ కల్యాణ్‌ కు ఘనస్వాగతం పలికారు. గుంటూరు చేనేత సత్యాగ్రహానికి పవన్‌ బయల్దేరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News