ఏపీ రాజధానిలో భూసేకరణకు వ్యతిరేకిస్తున్న రైతుల్ని కలిసేందుకు వచ్చిన జనసేన అధినేతకు పలువురు రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పవన్ తో మాట్లాడుతూ.. ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు.. నారాయణలను తిట్టిపోయటం కనిపించింది.
అన్నింటికి మించి నారాయణను రైతులు పేరు పెట్టి మరీ తిట్టేశారు. ఒక రైతు అయితే.. నారాయణను బిజినెస్ మ్యాన్ అని విమర్శించారు. మరో రైతు అయితే.. వార్డులో కూడా గెలవలేని నారాయణను తీసుకొచ్చి మంత్రిని చేశారని.. ఆయన రాక్షసంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పత్తిపాటి.. నారాయణ ఇద్దరూ మమ్మల్ని దొంగల్లా చేస్తున్నారంటూ విమర్శించారు. మిగిలిన మంత్రుల పేర్ల కంటే కూడా.. నారాయణ.. పత్తిపాటి పుల్లారావుల ఇద్దరి మీదనే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇంకొందరు రైతులు అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద కూడా తీవ్రస్థాయిలో తిట్టిపోశారు. మొత్తంగా రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వటానికి ఇష్టపడని రైతుల వాయిస్ పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తానికి తెలిసేందుకు పవన్ తాజా యాత్ర ఉపయోగపడిందని చెప్పక తప్పదు.