పెద్ద‌న్న బ‌ల‌గాల‌కు ఐసిస్ భారీ షాక్‌

Update: 2017-05-03 15:48 GMT
గ‌డిచిన కొద్దికాలంగా ఇస్లామిక్ స్టేట్ మీద సంపూర్ణ అధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించిన అమెరిక‌న్ ద‌ళాల‌కు తాజాగా ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా వ‌దిలిపెట్ట‌ని అగ్ర‌రాజ్యం ఐసిస్ పీచ‌మ‌ణిచేందుకు క‌రుకైన పాత్ర‌ను పోషిస్తోంది. ఇటీవ‌ల కాలంలో ముప్పేట దాడితో ఐసిస్‌ను భారీగా దెబ్బ తీసిన అమెరికాకు.. భారీ షాక్ త‌గిలేలా ఇస్లామిక్ స్టేట్ స‌రికొత్త ఎత్తు వేసింది.

తాజాగా అమెరిక‌న్ ఆర్మీనే ల‌క్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పిడింది ఐసిస్‌. అఫ్ఘానిస్తాన్  రాజ‌ధాని కాబుల్ లో అమెరిక‌న్ ఎంబ‌సీ ఎదుట బుధ‌వారం జ‌రిపిన ఆత్మాహుతి దాడిలో ఎనిమిది మంది మృతి చెందిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. అమెరికాకు చెందిన ముగ్గురు జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అఫ్గానిస్థాన్ మంత్రి ఒక‌రు అందించిన స‌మాచారం ప్ర‌కారం..కాబూల్ లోని అమెరిక‌న్ ఎంబ‌సీ ఎదుట ఆర్మీ కాన్వాయ్ పై ఐసిస్ ఉగ్ర‌వాదులు శ‌క్తివంత‌మైన బాంబుల‌తో ఆత్మాహుతి దాడుల‌కు పాల్ప‌డ్డారు. పేలుళ్ల ధాటికి అమెరికా ఆర్మీకి చెందిన ర‌ష్ అవ‌ర్ వాహ‌నంతో పాటు ప్ర‌జ‌ల‌కు చెందిన 23 వాహ‌నాలు తీవ్రంగా లాస్ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

అమెరికా.. ర‌ష్యా దెబ్బ‌కు తోడుగా సిరియా.. ఇరాన్ జాతీయ బ‌ల‌గాలు మ‌ప్పేట దాడితో ఐసిస్‌ ను  చావుదెబ్బ కొట్టేందుకు పావులు క‌దుపుతున్న వేళ‌.. పెద్ద‌న్న‌కే షాకిచ్చేలా ఐసిస్ దాడులు జ‌ర‌గ‌టం గ‌మ‌నార్హం. తాజా వాత‌ప‌రిణామం చూస్తే.. ఐసిస్ ను చావుదెబ్బ కొట్టేందుకు బారీ ప్ర‌య‌త్నాలు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News