సింధు కోట్ల లెక్క విని షాక్ తిందట

Update: 2017-01-13 05:44 GMT
రియో ఒలింపిక్స్ లో మన సింధును ఫైనల్స్ లో ఓడించిన కరోలినా మారిన్ ఇటీవల భారత్ వచ్చింది. ఇక్కడి టోర్నీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు.. తన చేతిలో ఓడిన సింధుకు దక్కిన నజరానాలు వరుస షాక్ లు తింటోంది. సింధుకు వచ్చి పడిన నజరానాలు విని తాను ఆశ్చర్యానికి గురైనట్లుగా చెప్పటమే కాదు.. ఇండియాలో ఈ ఆట ఇంత ఫేమస్సా అంటూ క్వశ్చన్ వేసింది.

రియోల్ సింధు ప్రదర్శనకు ప్రతిఫలంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా ప్రకటించిన నజరానాలతో పాటు.. బ్రాండింగ్.. తదితరాలతో తక్కువలో తక్కువ రూ.70 కోట్లకు పైనే (ప్రభుత్వాలు.. ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిందే రూ.13 కోట్లు. ఇంటి స్థలాలు.. బీఎండబ్ల్యూ కారు.. ప్రముఖ సంస్థలతోరూ.50 కోట్ల ఎండార్స్ మెంట్లు కలిపితే) వచ్చింది. అయితే.. సింధుపై ఫైనల్స్ లో గెలిచిన కరోలినా మారిన్ కు మాత్రం పెద్దగా ఫలితం లేదనే చెప్పాలి. స్పెయిన్ కు చెందిన ఈ భామకు ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించినందుకు ఆ దేశ సర్కారు రూ.70 లక్షల్ని బహుమతిగా అందించింది. కానీ.. భారత్ లో మాత్రం అందుకు భిన్నంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. ప్రైవేటు సంస్థలు.. వ్యక్తులు బహుమతుల మీద బహుమతులు ప్రకటించిన వైనం గురించి తెలుసుకున్న కరోలినా విస్మయాన్ని వ్యక్తం చేసింది.

సింధు మిలియన్ల నగదును దక్కించుకుందని విన్నా. అది చాలా ఎక్కువ. సింధుకు వచ్చిన మొత్తంలో నాకు కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే వచ్చింది. మా దగ్గర అంత లేదు’’ అని చెప్పుకొచ్చింది. మొత్తానికి సింధుకు సొంతమైన నజరానాలు కరోలినాకు దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చిందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News