కేంద్రమంత్రిపై ఈసీ సంచలన నిర్ణయం..

Update: 2019-04-30 04:40 GMT
కేంద్రమంత్రి రచ్చ చేశాడు. దీనిపై ఈసీ కూడా సీరియస్ అయ్యింది. ఏకంగా ఎఫ్ ఐఆర్ నమోదు చేయించింది. ఈసీ ఇంత సీరియస్ గా కేంద్రమంత్రిపై చర్య తీసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

పశ్చిమబెంగాల్ లోని అసోన్ సోల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బాబుల్ సుప్రియో సోమవారం పోలింగ్ సందర్భంగా హల్ చల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బోనాబనీ ప్రాంతంలోని 199 పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లాడు. అక్కడ ప్రిసైడింగ్ అధికారితోపాటు తృణమూల్ కాంగ్రెస్ ఏజెంట్ ను బెదిరించినట్టు సమాచారం.

బాబుల్ సుప్రియో పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళుతున్నట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై దుమారం రేగడంతో ఈసీ అధికారులు సీరియస్ అయ్యారు. ఆయనపై చర్యకు ఉపక్రమించారు.

ఇక ప్రిసైడింగ్ అధికారి కూడా తమపై కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో దౌర్జన్యం చేశాడని ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేయాలని ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది.
   

Tags:    

Similar News