ఏపీ మాజీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ బ్యాంకు స్కామ్ కు పాల్పడ్డారంటూ ఆయనపై కుప్పం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వైసీపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు.
కుప్పం కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో ఈ స్కామ్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స్కామ్ లో చంద్రబాబు సొంత పీఏ మనోహర్ ప్రమేయం ఉందని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.192 కోట్ల స్కాం బ్యాంకులో జరిగినట్టు కుప్పం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఉపేంద్రకుమార్ తెలిపారు. గత నెల మార్చిలో జరిగిన ఆడిట్ లో ఈ మొత్తం స్కామ్ వెలుగు చూసినట్లు చైర్మన్ తెలిపారు. రూ.46.75 లక్షల 30 బంగారం ప్యాకెట్లు .. దీనిపై వడ్డీ రూ.38.44 లక్షలు ఉందని వివరించారు. దీంతో పాటు నగదు కలిపి 192కోట్ల స్కాం జరిగినట్టు గుర్తించామన్నారు
ఈ బ్యాంకులో శ్రీనివాసులు అనే వ్యక్తి చంద్రబాబు పీఏ మనోహర్ రికమండేషన్ మేరకు వచ్చి 16 ఆలయ బాండ్లను పెట్టి ఈ డబ్బులు తీసుకెళ్లాడని ఈ బ్యాంకు మేనేజర్ వీఎస్వీ నవీన్ బాబు తెలిపారు. ఇదంతా టీడీపీ హయాంలోనే జరిగినట్టు వివరించారు. దీంతో చంద్రబాబు పీఏపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.