హైకోర్టు విభ‌జ‌న‌పై సుప్రీంకోర్టులో కేసు!

Update: 2018-12-28 17:19 GMT
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అనంత‌రం సైతం ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైకోర్టు విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రపతి సంతకంతో తుది ఉత్తర్వులను జారీ చేసింది. 2019 - జనవరి 1 నుంచి ఏపీ - తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఏపీకి 16మంది, తెలంగాణకు 10 మంది జడ్జీలను కేటాయించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం జనవరి 1 నుంచి ఏపీలో అమరావతి వేదికగా తాత్కాలిక భవనాల్లో హైకోర్టు సేవలు ప్రారంభం కానున్నాయి. జనవరి 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులు వేర్వేరుగా కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. కేసుల విచారణ - పూర్తి స్థాయి న్యాయ ప్రక్రియలు ప్రారంభం కాబోతున్నాయి.

అయితే, కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ఏపీలో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై హైదరాబాద్ లో ఉన్న ఏపీ న్యాయవాదుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ బార్ అసోసియేషన్ లో సమావేశమైన న్యాయవాదులు హై కోర్టు విభజనపై చర్చించారు. తగిన సమయం ఇవ్వకుండా  హైకోర్టు విభజన చేశారని - ఈ అంశంపై శనివారం సుప్రీం కోర్టులో  హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.

మ‌రోవైపు హైకోర్టు విభజనపై ఏపీ లాయర్లు భగ్గుమన్నారు. హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ పై ఆంధ్రప్రదేశ్ లాయర్లు నిరసన తెలిపారు. హైకోర్టులో ఆంధ్ర - రాయలసీమ లాయర్లు ఆందోళనకు దిగారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏపీ న్యాయవాదులు కలిశారు. అమరావతిలో భవన సముదాయాలు - సదుపాయాలు లేకుండా ఎలా వెళ్లాంటూ నిలదీశారు. సమయం ఇవ్వకుండా కేసుల విభజన - సిబ్బంది విభజన ఎలా సాధ్యమని లాయర్లు ప్రశ్నించారు. అక్కడ సరైన సౌకర్యాలు లేవని...కనీసం టాయిలెట్స్ కూడా లేవని ఆవేదన చెందారు. జడ్జీల రూమ్స్ ఏమీ లేకుండానే కేవలం ఉన్నట్లుగా, అన్ని వసతులు కల్పించినట్లుగా అఫిడవిట్ లో త్రిశంఖు స్వర్గం చూపించాపించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని విమర్శించారు. లాయర్ల ఆందోళన - నిరసనలతో కోర్టు ప్రాంగణం మార్మోగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి కొన‌సాగింపుగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాల‌నే నిర్ణ‌యం తీసుకున్నారు.
Tags:    

Similar News