నోరు అదుపు లో పెట్టుకొని మాట్లాడాలి అని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా. ఒక్కసారి నోటి నుండి మాట జారితే మళ్లీ , ఆ మాటని వెనక్కి తీసుకోవడం అసాధ్యం కాబట్టి ..ఒక మాట మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా అలోచించి మాట్లాడాలి. మరీ ముఖ్యంగా సెలెబ్రెటీ హోదా ఉన్న వారు ఇంకా కొంచెం జాగ్రత్త గా ఉండాలి. ఎందుకు అంటే వారి చుట్టూ ప్రతి క్షణం కెమెరాలు తిరుగుతూనే ఉంటాయి. ఏ చిన్న అవకాశం ఇచ్చినా దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇంతకీ ఇప్పుడు ఏమైంది అంటే ..? ఒక మతాన్ని కించ పరుస్తూ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నటి, ప్రొడ్యూసర్ రవీనా టాండన్ పై పంజాబ్ లో కేసు నమోదు అయింది.
ఇంతకీ ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేసింది అంటే ... తాజాగా పంజాబీలో భారతీ సింగ్ హోస్ట్ గా నిర్వహిస్తున్న "బ్యాక్ బెంచర్స్" అనే రియాలిటీ షోలో రవీనా టాండన్, దర్శకురాలు ఫరా ఖాన్ లు పాల్గొన్నారు. షో లో భాగంగా వీరిని హోస్ట్ భారతీ సింగ్ "హలలూయా" కి స్పెల్లింగ్ రాయమని అడిగింది. దానికి వారు తమ సమాధానాన్ని బోర్డు పై వేరు వేరుగా రాశారు. ఆ తరువాత ఇద్దరు కలిసి ఆ స్పెల్లింగ్స్ పై షోలో కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు.దీనితో వారు చేసిన ఆ వ్యాఖ్యలపై మండిపడ్డ క్రిస్టియన్ మతస్థులు రవీనా, ఫరా ఖాన్, భారతీ సింగ్ తమ మతాన్ని కించపరిచారంటూ అంజాలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన రవీనా టాండన్ ..మేము కావాలని ఆలా మాట్లాడలేదు అని , ఎవరినీ అవమానించడం తమ ఉద్దేశం కాదని తెలియ జేస్తూ , షోలో జరిగిన సన్నివేశాన్ని తన ట్విట్టర్ ఖాతా లో పోస్టు చేశారు. ‘దయచేసి అందరూ ఒకసారి ఈ లింక్‌ను చూడండి. ఏ మతాన్ని అవమానించినట్లుగా నేను మాట్లాడలేదు. మేం ముగ్గురం ఎవరినీ కించపరచాలని ఎప్పుడూ అనుకోలేదు. మా మాటల వల్ల ఎవరైనా బాధ పడితే వారికి నా హృదయపూర్వక క్షమాపణలు' అని ట్వీట్ చేసింది.
అయితే, ఈ కేసు పై స్పందించిన డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ సోహన్ సింగ్ .. టెలివిజన్ షోలో క్రైస్తవుల మనోభావాలను దెబ్బ తీశారని హీరోయిన్ రవీనా టాండన్, హాస్యనటి భారతీ సింగ్ మరియు దర్శకురాలు, నిర్మాత ఫరా ఖాన్‌లపై మాకు ఫిర్యాదు వచ్చింది. దీనితో 295 -ఏతోపాటు వివిధ సెక్షన్ల కింద ముగ్గురి పై కేసు నమోదు చేశామని, దాని పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.