ర‌జనీతో దోస్తీ..డైరెక్ట‌ర్‌ పై బీజేపీ నేత‌ల దాడి

Update: 2018-06-10 16:47 GMT
త‌మిళనాడులో రాజ‌కీయాల వేడి మ‌రింత ముదురుతోంది. ఆ రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున్నే క‌స‌ర‌త్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అధికార అన్నాడీఎంకే పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న బీజేపీ...సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ ను సైతం త‌మ ముగ్గులోకి దింపాల‌ని చూస్తోంది. అయితే, త‌మిళ నేల‌పై సాగుతున్న రాజ‌కీయాలు కొత్త మ‌లుపు తిరిగి దాడులు చేసుకునే స్థాయికి చేరాయి. తాజాగా ఓ ద‌ర్శ‌కుడిపై దాడికి దిగే య‌త్నం చేసిన ఉదంతం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

త‌మిళ‌నాడుకు చెందిన పుతియ‌త‌లైమురై ఓ ప్రైవేట్ కాలేజీ ఆధ్వ‌ర్యంలో దర్శకుడు అమీర్ - బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌ రాజన్ - కొంగు ఇళంజర్‌ పేరవై నిర్వాహకుడు తనియరసుతో ఓ చ‌ర్చాగోష్టిని నిర్వ‌హించింది. ఈ టీవీషోలో ద‌ర్శ‌కుడు అమీర్ కూడా పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ``2016లో కోయంబ‌త్తూరులో హిందుత్వ సిద్ధాంతాల‌కు మ‌ద్ద‌తిచ్చే సి.శ‌శికుమార్ అనే వ్య‌క్తి చ‌నిపోయిన స‌మ‌యంలో పోలీసులు ఫైరింగ్ చేయ‌లేదు. కానీ ఇటీవ‌ల స్టెరిలైట్ కంపెనీకి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో మాత్రం కాల్పులు జ‌రిపారు.`` అని వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన బీజేపీ కార్య‌క‌ర్త‌లు అమీర్‌ పై దాడికి ప్ర‌య‌త్నించారు. దీంతో ఆ షో మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. మ‌రోవైపు ఇదే షో సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్‌ తో బీజేపీ దోస్తీ నెరుపుతోంద‌ని, ఇది స‌రికాద‌ని వ్యాఖ్యానించారు.

అయితే, ఈ షో అనంత‌రం కూడా అమీర్ వెళ్తున్న కారుపై దాడికి బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నించారు. అయితే కారులో అమీర్ లేరు. ఆ కారులో ఉన్నవాళ్లు భయాందోళనకు గురై బయటకు రావడంతో అందులో అమీర్ లేడని నిర్దారించుకుని బీజేపీ నేత‌లు అక్కడి నుండి పారిపోయారు.ఈ వ్యవహారంపై నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కరుమత్తంపట్టి డీఎస్‌పీ జయచంద్రన్‌ విచారణ జరుపుతున్నారు.
Tags:    

Similar News