డూప్లికేట్ సీఎం.. అచ్చం అలానే రెడీ అయ్యి మోసం.. అరెస్ట్

Update: 2022-09-20 11:57 GMT

మనుషులను పోలిన మనుషులు ఈ భూమ్మీద ఏడుగురు ఉంటారు అని అంటారు. ఈ కాన్సెప్ట్ పై బోలెడన్నీ సినిమాలు వచ్చాయి. కానీ నిజజీవితంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్ర సీఎంను కాపీ చేసిన ఓ అచ్చం లాంటి వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో కటకటాల పాలయ్యాడు.

మహారాష్ట్ర సీఎంను పోలిన వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి వేషధారణలో కనిపిస్తున్నాడు. ప్రజల్లో తిరిగేస్తున్నాడు. ఫొటోలు దిగుతున్నాడు. ఆటో గ్రాఫ్ లు ఇచ్చేస్తున్నాడు. ఇది సీఎంకే ఇబ్బంది తెచ్చిపెట్టేలా మారింది.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ డూప్లి కేట్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో జరిగిన సీఎం.. డూప్లికేట్ సీఎంకు సంబంధించిన ఇప్పుడు వైరల్ అవుతోంది.

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వేషధారణలో ప్రజలను మోసం చేసిన ఫూణెకు చెంది విజయ్ మానే అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేలా కనిపించి ఆయన తరహాలోనే విషధారణలో విజయ్ మానే బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ సీఎంగా చెప్పుకుంటున్నాడు. ఈ మధ్య విజయ్ మానే.. పాత నేరస్థుడు మోహోల్ తో కలిసి ఫొటోలు దిగాడు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సీఎం ఏక్ నాథ్ షిండే వేషధారణలో విజయ్ మానే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు.ఇది షిండే ప్రతిష్టను దిగజార్చుతోందని ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని షిండే నేతలు డిమాండ్ చేస్తున్నారు.

శివసేనలో తిరుగుబాటు చేసిన ఏక్ నాథ్ షిండే.. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. తానే సీఎం అన్నట్టుగా కలరింగ్ ఇస్తున్నాడు. మోసాలకు పాల్పడుతున్నాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News