మోడీ రాజ్యంలో అంతేనా?: ప‌్ర‌కాశ్‌ రాజ్ పై కేసు!

Update: 2017-10-05 07:49 GMT
ఈ ముచ్చ‌ట వింటే నోటి వెంట మాట రాదు. దేశం యాడికి పోతోంద‌న్న ఫీలింగ్ రాక మాన‌దు. దేశంలో భావ‌స్వాతంత్య్రం ఉందా?  లేదా?.. అన్న డౌట్ రాక మాన‌దు. మ‌రికాస్త ఆలోచిస్తే.. భావ‌స్వేచ్ఛ‌ను కొంద‌రికి మాత్ర‌మే ప‌రిమితం చేశారా? అన్న క్వ‌శ్చ‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. న‌చ్చ‌ని మాట‌ల్ని న‌చ్చ‌లేద‌ని చెప్ప‌టం చ‌ట్ట‌విరుద్ధం కాదు. అది సామాన్యుడి గురించైనా.. దేశ ప్ర‌ధాని గురించైనా కావొచ్చు.

కానీ..ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదా? అన్న సందేహం క‌లిగేలా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రంలో ప్ర‌ముఖ మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ గౌరీ లంకేశ్ ను దారుణంగా హ‌త్య చేయ‌టం.. దీనిపై దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు వ్య‌క్తం కావ‌టం తెలిసిందే.

భారీ చర్చ‌కు తెర తీసిన గౌరీ లంకేశ్ హ‌త్య ఉదంతంపై ప్ర‌ధాని మోడీ స్పందించ‌ని వైనాన్ని ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌స్తావించ‌ట‌మే కాదు.. మోడీ న‌టిస్తే తాను తెలుసుకోలేనా? అన్న మాట‌ను కూడా మాట్లాడారు. తాను పెద్ద న‌టుడిన‌ని.. త‌న లాంటి న‌టుడికి.. వేరే వారు న‌టిస్తే అర్థం చేసుకోలేని ప‌రిస్థితుల్లో ఉంటాన‌ని అనుకోకూడ‌ద‌ని చెబుతూ.. గౌరీ లంకేశ్ ఉదంతంపై ప్ర‌ధాని మోడీ రియాక్ట్ కాక‌పోవ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మార‌టం తెలిసిందే. ప్ర‌ధాని మోడీని ఒక ప్ర‌ముఖ సినీ న‌టుడు ఇంత తీవ్రంగా విమ‌ర్శించ‌టం చాలా చాలా త‌క్కువ‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ప్ర‌కాశ్ రాజ్ విమ‌ర్శ‌ల‌పై తాజాగా ఒక కేసు న‌మోదైంది. ల‌క్నోకు చెందిన ఒక లాయ‌ర్ కోర్టులో కేసు న‌మోదు చేశారు. ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు చేసిన వైనాన్ని ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌కాశ్ రాజ్ పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కోర్టును కోరారు. ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు చేసిన ప్ర‌కాశ్ రాజ్ పై కేసు న‌మోదైన తీరుపై ప‌లువురు అవాక్కు అవుతున్నారు.మోడీని ఆ మాత్రం కూడా విమ‌ర్శించ‌కూడ‌దా? అంత మాత్రానికే కేసులు పెట్టేస్తారా? అంటూ నోరెళ్ల‌బెడుతున్న ప‌రిస్థితి.
Tags:    

Similar News