ధోని పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు ...ఏంచేసాడంటే !

Update: 2019-12-03 08:37 GMT
మహేంద్ర సింగ్ ధోని ..ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్. దాదాపు 28 ఇళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఇండియన్స్ యొక్క ప్రపంచ కప్ కలని నిజం చేసిన ఘనత ధోని సొంతం. ధోని గౌండ్ లో ఉన్నాడు అంటే .ఇండియా విజయం ఖాయం అనుకునేంత స్థాయికి ఎదిగాడు. ప్రపంచ మేటి బ్యాట్ మేన్స్ లో ఎం ఎస్ ధోని కూడా ఒకరు. ప్రస్తుతం ధోని రెస్ట్ తీసుకుంటున్నాడు. ప్రపంచ కప్ లో ఇండియా ప్రయాణం ముగిసిన వెంటనే ..ఆర్మీ లో కొన్ని రోజలు దేశ సేవ చేసిన ధోని ..ఆ తరువాత పూర్తిగా ఫ్యామిలీతోనే సమయాన్ని గడుపుతున్నారు. ఇక ధోని లో ఉండే మరో బెస్ట్ క్వాలిటీ ..మైదానంలోనైనా   , బయట అయినా  ధోని చాలా కూల్‌గా ఉంటాడు.

ఇకపోతే ఎప్పుడు వివాదాల జోలికే పోనీ ధోని ..తాజాగా ఒక వివాదం లో పడ్డాడు. తాజాగా  ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ స్కామ్‌ లో పోలీసులు ధోనీ పై ఎఫ్‌ ఐ ఆర్ నమోదు చేశారు. ఒకానొక సమయంలో  ఈ సంస్థకు ధోని ప్రచార కర్తగా వ్యవహరించాడు. ఈ ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని ఉండటంతో చాలామంది ఫ్లాట్ల కోసం డబ్బులు అడ్వాన్స్ రూపంలో సంస్థకి డబ్బులు చెల్లించారు. అలా వచ్చిన కోట్ల సొమ్మును ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అనేక కంపెనీలకు తరలించారు. ఆ కంపెనీల లిస్ట్‌లో ధోని భార్య సంస్థ కూడా ఉండటం గమనార్హం.

ఇక అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు తీసుకుని లబ్దిదారులకు ఫ్లాట్లను అప్పజెప్పక పోవడంతో.. లబ్దిదారులందరూ పోలీసులను ఆశ్రయించారు. 2017లో ఈ కేసు సుప్రీం కోర్టుకి చేరగా.. ఆ సంస్థ మోసాలకు పాల్పడిందని తేలడంతో ఆమ్రపాలి డైరెక్టర్లు జైలుపాలయ్యారు. ఇకపోతే ఇప్పుడు ఈ స్కామ్ ఇటు తిరిగి.. అటు తిరిగి ధోని మెడకు చుట్టుకుంది. ధోనీపై నమ్మకంతోనే ఫ్లాట్ల కొనుగోలుకు డబ్బును కట్టామని.. ఈ కుట్రలో అతడికి కూడా భాగం ఉండొచ్చని లబ్దిదారులందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో  ధోనీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. కాగా, సుప్రీం కోర్టు ఆమ్రపాలి సంస్థపై తుది తీర్పు ఇచ్చిన తర్వాత ధోని విషయంలో పోలీసులు ముందుకెళ్లే అవకాశాలు  ఉన్నాయని తెలుస్తుంది.
Tags:    

Similar News