భార‌త్‌ను కీర్తించిన ఎన్నారై పై అమెరికాలో కేసు!?

Update: 2020-04-13 10:10 GMT
కరోనా వైరస్ క‌ట్ట‌డిలో భార‌త‌దేశం ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో లాక్‌డౌన్ విధించి ప్ర‌జ‌ల‌ను ఇంటికే ప‌రిమితం చేసి క‌రోనా కేసులు వెలుగులోకి వ‌స్తే వారికి స‌త్వ‌ర‌మే వైద్య సేవ‌లు అందిస్తోంది. అయితే భార‌త్‌తో పోల్చి చూస్తే అమెరికాలో స‌క్ర‌మంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ దేశంలో క‌రోనా బాధితులు ఆరు ల‌క్ష‌ల‌కు చేర‌గా, మృతులు 22 వేల మందికి పైగా ఉన్నారు. ఈ క్ర‌మంలో భార‌త్‌, అమెరికాలో ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో, ఎలా క‌ట్ట‌డి చేస్తున్నార‌ని పోలుస్తూ అమెరికాలో నివ‌సిస్తున్న ఓ భార‌తీయురాలు ఓ వీడియోలో మాట్లాడుతూ తెలిపింది. ఈ సంద‌ర్భంగా భార‌త‌దేశంలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప‌టిష్టంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని ప్ర‌శంసిస్తూనే అమెరికాలో స‌క్ర‌మంగా ప్ర‌భుత్వాలు స్పందించ‌డం లేద‌ని అమెరికాపై విమ‌ర్శ‌లు చేసింది. అయితే ఇవి సోష‌ల్ మీడియోలో వైర‌లైంది.

అయితే అమెరికాలో నివ‌సిస్తున్న ఓ తెలుగు వ్య‌క్తే ఆమె వీడియోను చూసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అమెరికాను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు అక్కడి పోలీసులకు వివ‌రించి మ‌రీ కేసు నమోదు చేయించారు. అమెరికాపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో అమెరికాలోని న్యూజెర్సీలో ఆమెపై కేసు నమోదైన సంఘ‌ట‌న వైర‌ల‌వుతోంది.

తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతి దేవినేని  చాలాకాలంగా అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తోంది. అక్క‌డ ఒకట్రెండు తెలుగు న్యూస్ ఛానళ్లకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఈ క్ర‌మంలో అమెరికాలో కరోనా వైరస్ క‌ల్లోలం సృష్టిస్తోంది. దీంతో భార‌త‌దేశ ప‌రిణామాలను, అమెరికాలోని ప‌రిస్థితుల‌ను పోలుస్తూ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. కరోనా వ్యాప్తిని నివారించడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందని, ఈ విషయంలో భారత్ అద్భుత పనితీరును కనపరుస్తోందని తెలిపిన విష‌యం తెలిసిందే. కరోనా వైరస్ చికిత్సలో అమెరికా సైతం భారత్‌పై ఆధారపడిందని, మేరా భారత్ మహాన్ అంటూ కామెంట్స్ చేసిన వీడియోను అమెరికాలోనే నివ‌సిస్తున్న తెలుగు వ్య‌క్తి శ్రవణ్ అక్క‌డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై లిఖితపూరకంగా ఫిర్యాదు చేయ‌డంతో అక్క‌డి పోలీసులు స్వాతి దేవినేనిపై కేసు నమోదు చేశారు.

ఈ సంద‌ర్భంగా శ్ర‌వ‌ణ్ కూడా ఓ ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికాలో ప్రజలలో ద్వేషాన్ని వ్యాప్తి చేసేలా ఆమె వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అయితే తనపై కేసు నమోదు కావడంతో స్వాతి దేవినేని క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూరకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News