ఎస్సీలపైనే అట్రాసిటి కేసా...మండిపోయిన హైకోర్టు

Update: 2020-11-27 23:30 GMT
ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసిన ఘటనపై హైకోర్టు మండిపోయింది. ఆందోళన చేస్తున్న అమరావతి ఎస్సీ రైతులపైనే అట్రాసిటి కేసులు ఎలా నమోదు చేస్తారంటూ పోలీసులను కోర్టు నిలదీసింది. సరైన కారణాలు లేకుండానే ఆందోళన చేశారనే కారణంతో రైతులను 18 రోజులుగా జైల్లో ఉంచటం ఏమిటంటు నిలదీసింది. ఇలా చేయటమంటే పౌరుల ప్రాధామిక హక్కులకు పోలీసులు భంగం కలిగించినట్లు కాదా ? సూటిగా ప్రశ్నించింది.

సరైన కారణాలు లేకుండానే రైతులను అరెస్టు చేయటమంటే కోర్టు ధిక్కారం క్రిందకే వస్తుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. పోలీసులు తమకు తోచినట్లు చేస్తుంటే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతున్నట్లు ఎలా అనుకోవాలంటూ ఆక్షేపించింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పోలీసులు వ్యవహరిస్తుంటే జనాలు ఎక్కడికెళతారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఆందోళన చేశారన్న కారణంతో కొందరు ఎస్సీ రైతులను పోలీసులు అరెస్టులు చేయటం, చేతులకు బేడీలు వేయటం కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పోలీసులు కోర్టు చేత అక్షింతలు వేయించుకున్నారు.


Tags:    

Similar News